రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జూలై 9:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, నిజాంపేట జడ్పిటిసి సభ్యులు పంజ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో హాస్టల్ ముందు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు తాము మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవుని మనుగడకు ఆరోగ్యానికి ప్రధాన కారణం మొక్కలు అవి మనకు ఆక్సిజన్ అందించి ఆరోగ్యాన్ని అందిస్తాయని వారు తెలిపారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇండ్ల వద్ద మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించి కాపాడుకోవాలని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నవత రాజేంద్రప్రసాద్, ఒలిస. దామోదర్ రావు, జె.శంకర్ గౌడ్,కొడపర్తి నరేందర్,బండారి ఎల్లంగౌడ్,బిజెపి మండలాధ్యక్షులు బానప్పగారి దయానంద రెడ్డి, సతీష్ రావు, లక్ష్మణ్, నరేష్ యాదవ్, స్వామి, అనిల్ మరియు నిజాంపేట మండల నాయకులు పాల్గొన్నారు.