జూలూరుపాడు, జులై 09, నేటి గద్దర్ : బంజారాల ఆరాధ్య దైవం సీత్లా భవాని (దాటుడు) తొలి పండుగ వేడుకలను మండల వ్యాప్తంగా మంగళవారం లంబాడీలు ఘనంగా జరుపుకున్నారు. ఊరి పొలిమేరలో దేవతలను ప్రతిష్టించి బంజారాల సాంప్రదాయ ప్రకారం వారి కుల పెద్ద అనగా పూజారి నియమనిష్టలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాలలోని పెద్దలు, మహిళలు, పిల్లలు భక్తి శ్రద్ధలతో దేవతలకు ప్రత్యేక నైవేద్యం సమర్పించారు. పశుసంపద, పాడి పంటలు, పిల్లాపాపలు ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని ఆ దేవతలను ప్రార్థించారు. ఆట పాటలు, డప్పు వాయిద్యాలతో కోళ్లు, మేకపోతులు అర్పించి మొక్కులు చెల్లించారు. అనంతరం పొలిమేరలో వారి పశువులను దాటుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.
Post Views: 349