విరమణ చేసిన ఆలయ కమిటీ
ముఖ్య పాత్ర పొచించిన (CPI)ML మాస్ లైన్
కొండా. కౌశిక్
కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ రెండవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
పాత్రికేయులు పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మండలంలోని ప్రముఖులు ఈ దీక్షలకు మద్దతు తెలపడం జరిగింది
దీక్ష విరమించాలంటూ చర్చలకు ఆహ్వానించిన మండల తాసిల్దార్
తహసిల్దార్ ఇచ్చిన స్పష్టమైన హామీ మేరకు రిలే నిరహార దీక్ష తాత్కాలిక విరమన
15 రోజుల్లో కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రభుత్వ భూమిలో నిర్మించిన నిర్మాణాలను తొలగించకపోతే తిరిగి ఉద్యమం చేపడతాం
ఈ రిలే నిరాహార దీక్షలకు సహకరించిన, మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు
శ్రీ కన్యక పరమేశ్వరి దేవీ ఆలయ కమిటీ మరియు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చర్ల మండల కమిటీ
చర్ల మండలంలో ఆక్రమణకు గురైన కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రభుత్వ భూమిని రెవిన్యూ వారు స్వాధీన పరచుకోవాలని ఆ భూమిని ఆలయ కమిటీకి రాతపూర్వకంగా ఇవ్వాలని శ్రీ కన్యక పరమేశ్వరి దేవీ ఆలయ కమిటీ మరియు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఈరోజుకి రెండవ రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పుర ప్రముఖులు ఈ దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగానే చర్ల *సీనియర్ ప్రెస్ క్లబ్ పాత్రికేయులు* మద్దతు తెలియజేసారు చర్ల సీనియర్ ప్రెస్ క్లబ్ బాధ్యులు దొడ్డ ప్రభుదాస్ మాట్లాడుతూ గత 20 ఏళ్ల నుంచి ఆ ప్రభుత్వ భూమి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం ఆధీనంలో ఉంది అని అన్నారు ఆ భూమిని ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొందరు ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేపట్టడం అత్యంత దుర్మార్గమని అన్నారు రెవిన్యూ వారు ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు తక్షణమే ఆ భూమిని స్వాధీన పరుచుకొని ఆలయ కమిటీకి అప్పగించడమే న్యాయమని అన్నారు
*దీక్షలకు మద్దతు తెలిపిన బిఆర్ఎస్* పార్టీ నాయకులు లంక రాజు దొడ్డి తాతారావు లు మాట్లాడుతూ ఆలయ ప్రభుత్వం భూమిలో నిర్మించిన ఇళ్లను తొలగించాలని విద్యుత్ అధికారులు ఇచ్చిన కరెంటు మీటర్లు వెనక్కి తీసుకోవాలని చర్లలో జరుగుతున్న ప్రభుత్వ భూముల అక్రమణం రెవిన్యూ వారు నిలుపుదల చేయాలని అన్నారు వెంటనే రెవిన్యూ వారు స్పందించి ఆక్రమణకు గురైన కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకోవాలని ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు
*మద్దతు తెలియజేసిన బిజెపి* నాయకులు మాట్లాడుతూ చర్లలో గుడి బడి తేడా లేకుండా ప్రభుత్వ భూమి కనబడితే చాలు ఆక్రమణకు గురవుతుందని ఇది రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని దీని కారణంగా భవిష్యత్తులో ప్రభుత్వ భూమి అనేది లేకుండా పోతుందని అన్నారు 20 సంవత్సరాలుగా గుడి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించడం అంటే అత్యంత దుర్మార్గం అని ఇది ఏమాత్రం సహించదగ్గ విషయం కాదని అన్నారు రెవెన్యూ వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని లేకుంటే భవిష్యత్తులో భక్తులందరినీ ఏకం చేసి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు
*మద్దతు తెలిపిన విశ్వబ్రాహ్మణ సంఘం* మండల కన్వీనర్ గుంటుపల్లి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని ఆక్రమించి కట్టిన ఇళ్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పంచాయతీ వారు ఎలా ఇచ్చారని విద్యుత్ అధికారులు కరెంటు మీటర్ ఎలా ఇచ్చారని ఇది పలు రకాల అనుమానాలకు దారితీస్తుందని తక్షణమే పంచాయతీ వారు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ని కరెంటు మీటర్లను రద్దు చేయాలని ఆక్రమణకు గురైన దేవాలయ భూమిని రెవిన్యూ వారు స్వాధీనపరచుకొని ఆలయ కమిటీ కాబోముని రాతపూర్వకంగా అప్పగించాలని అన్నారు
*తాసిల్దార్ స్పష్టమైన హామీతో తాత్కాలికంగా దీక్ష విరమణ
ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండ కౌశిక్ మాట్లాడుతూ మండల తాసిల్దార్ గారు దీక్షల విరమించాలంటూ చర్చలు కు ఆహ్వానించడం జరిగిందని చర్చల అనంతరం ఎమ్మార్వో గారు
కచ్చితంగా ఆక్రమణకు గురైన కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రభుత్వ భూమినీ స్వాధీనపరచుకుంటామని, ఇప్పటికే ఆక్రమించిన వారికి నోటీసులు జారీ చేశామని, 15 రోజుల తర్వాత ఆ భూమిలో నిర్మించిన కట్టడాలను తొలగిస్తామని, ఆక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తక్షణమే ఆ భూమిలో ఇది ప్రభుత్వ భూమి అని రెవిన్యూ బోర్డు పెడతామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఎమ్మార్వో గారి స్పష్టమైన హామీ మేరకు ఈ రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా విరమించడం జరిగింది. హామీ మేరకు 15 రోజుల్లో అధికారులు ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించకపోతే అధికారులు తప్పకుండా మళ్లీ ఉద్యమం కొనసాగుతుంది అని అన్నారు ఈ ఉద్యమానికి సహకరించిన మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు భవిష్యత్తులో జరిగే ప్రజా పోరాటాలకు ఇదే రకమైన సహకారం అందించాలని ప్రజలను కోరారు.