నేటి గదర్ న్యూస్ జులై 09:వైరా నియోజక వర్గ ప్రతినిధి. శ్రీనివాసరావు:
వైరా మండలం ముసలిమడుగుగ్రామము బొడ్రాయి, సెంటర్ నందు కాకతీయ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం వారు చెరుకు రైతులతో సమావేశాలు పెడుతూ వైరా రైట్ జోన్లో
గండ గలపాడు ముసలమడుగు గ్రామాల్లో తిరుగుతూ రైతులని చెరుకు వేయమని ప్రోత్సహించుచున్నారు డిసెంబర్ నెలలో చెరుకు వేసే రైతులకు నాలుగున్నర అడుగుల దూరం పెట్టిన యెడల విత్తనము రెండు టన్నులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది .మరియు చెరుకు మిషన్ చేత కటింగ్ చేసినట్లయితే తక్కువ ఖర్చుతో లాభం జరుగుతుంది. ఈ సంవత్సరం చేరుకు నరికే కూలీలను యాజమాన్యం వారు మాట్లాడుతూ అందరిని ఒకటే ధర చెల్లించమని, రైతులెవరు పోటీపడి కూలీల
ధరులు పెంచవద్దని అందరినీ కూడా ఒకే ధర చెల్లించే విధంగ ఏర్పాటు చేస్తున్నారు. కావున రైతులందరూ చెరుకు సాగు చేయవలసిందిగా రైతులని ప్రోత్సహిస్తున్నారు. ఈ సమావేశంలో షుగర్ ఫ్యాక్టరీ కి సంబంధించి కేన్ మేనేజర్ హరినాధ బాబు, గ్రామ రైతులు, చింత నిప్పు.శ్రీనివాసరావు, కేతవరపు వెంకటేశ్వర్లు, అనుమోలు స్వామి, చింత నిప్పు వెంకటకృష్ణారావు, అంకం శ్రీను, కేతవరపు సీతారాములు తదితరులు పాల్గొన్నారు.