★ మధ్యం ఎమ్మార్పీ రేట్లకే విక్రయించాలి..
★ఎమ్మార్పీఎస్ , ఎంఎంఎస్ డిమాండ్.
నేటి గదర్ న్యూస్, భద్రాచలం:
స్థానిక భద్రాచలం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్ హౌస్ అధికారి గారికి దుమ్ముగూడెం మండలంలోని గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపుల నిర్వాహకులపై క్రిమినల్ నమోదు చేయాలని, మద్యాన్ని ఎమ్మార్పీ రేట్లకే అమ్మాలని డిమాండ్తో మహాజన మహిళా సమైక్య ఎంఎంఎస్, మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెప్రెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు మేకల లత, ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల తిరుపతి మాదిగలు మాట్లాడుతూ……. దుమ్ముగూడెం మండలంలోని ప్రతి గ్రామంలో అక్రమ మద్యం ఏరులై పారుతుందని, ప్రభుత్వ అధికారులు బెల్ట్ షాపుల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకొకపోవటం వల్లన విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని అమ్ముడం జరుగుతుందని అన్నారు. బెల్ట్ షాపులో విక్రయించే కల్తీ మద్యం తాగడం వల్ల అనేకమంది యువకులు రోగాల బారిన పడ్డారని, అనేక కుటుంబాలు పెద్దదిక్కు లేకుండా పోయాయని, ఆవేదన వ్యక్తపరిచారు. మద్యాన్ని ఎమ్మార్పీ రేట్లు కు విక్రయించకుంటే ప్రభుత్వంపై దశల వారి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా పెరియార్, సీనియర్ నాయకులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షురాలు కొచ్చర్ల కుమారి, కార్యదర్శి కొప్పుల నాగమణి తదితరులు పాల్గొన్నారు