నేటి గద్దర్ అనంతగిరి న్యూస్:
అల్లూరి జిల్లా అనంతగిరి విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని మదర్ థెరీసా సేవా సంఘం మరియు బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు త్యాడ.ప్రసాద్ పట్నాయక్ అన్నారు. విజయనగరం జిల్లాలోని అయ్యన్నపేట కూడలిలో ఉన్న మదర్ థెరీసా సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అనంతగిరి మండలంలోని పల్లంవలస మండపర్తి బూడి బంగారమ్మపేటలో ఉన్న ఎలిమెంటరీ పాఠశాలల్లో చదువుతున్న 150 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ స్కేలు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు.అనంతరం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ప్రసాద్ పట్నాయక్ మాట్లాడుతూ..ప్రతి విద్యార్థి పేదరికాన్ని అధిగమించి విద్యలో రాణించినప్పుడే భవిష్యత్ ఉజ్వలమవుతుందన్నారు.సమాజంలో జీవితాలను మార్చేది చదువేనని చదువు చాలా గొప్పదని దానికి కులం మతం జాతి అనే తేడాలు ఉండవని విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు రమణజీ చైతన్య జోగారావు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అప్పారావు శాంతి చిన్నమ్మి పద్మావతి భవాని తదితరులు పాల్గొన్నారు.