నేటి గద్దర్ వెబ్ న్యూస్:
ఉత్తరప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ జిల్లాలో గుండెల్ని పిండేసే సంఘటన చోటుచేసుకుంది. టైఫాయిడ్ బారిన పడిన ఓ టీనేజీ బాలిక మెరుగైన వైద్యం అందక కన్నుమూయడంతో ఆమె మృతదేహాన్ని ఇద్దరు సోదరులు భుజంపై మోసుకుంటూ ఏకంగా 5 కిలోమీటర్లు నడిచిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. లఖీంపూర్ ఖేరీ జిల్లాలోని పాలియాలో శివానీ అనే బాలిక రెండు రోజుల కిందట టైఫాయిడ్ బారినపడింది. ఆమెను సోదరులు స్థానిక వైద్యుడికి చూపించగా మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆస్పత్రికి తరలించాలని సూచించారు.
కానీ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పాలియాలోని రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. శారదా నది ఉప్పొంగడంతో జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. వాహన రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
_ఈలోగా ఆమె పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే దారిలో మరణించింది. దీంతో ఇక చేసేదిలేక సోదరులు విలపిస్తూనే ఆమె మృతదేహన్ని 5 కిలోమీటర్లమేర భూజాన మోసుకుంటూ తిరిగి ఇంటికి తీసుకెళ్లారు._