★మెట్టగుడ గ్రామంలో పాఠశాల మంజూరు చేయాలి లక్ష్మీపురం సర్పంచ్ కొర్ర త్రినాధ్ డిమాండ్
నేటి గదర్, ముంచంగిపుట్టు మండల న్యూస్:
అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయితీ,
ఈ సందర్భంగా సర్పంచ్ కొర్ర.త్రినాధ్ మాట్లాడుతూ మెట్టగుడలో పాఠశాల లేకపోవడంతో 14 మంది విద్యార్థులు రెండు వైపులా మూడు కిలో మీటర్లు దూరంలో ఉన్న లక్ష్మీపురం ఎంపిపి పాఠశాలలో కాలినడకన గాటీ రహదారిలో వచ్చి చదువుతున్నారు. ఈ గ్రామాల మధ్య పెద్ద గెడ్డ ఉంది,వర్షాకాలంలో దాటాలంటే కష్టంగా ఉంటుంది.మెట్ట గుడలో పాఠశాల మంజూరు చేయాలని గతంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగా పని చేసిన శ్రీ వినయ్ చంద్ గారికి వినతి పత్రం అందజేస్తే స్పందించిన పి ఓ ఒక సంవత్సరం పాటు తత్కలింగా పాఠశాల ఏర్పాటు చేశారు.అది మరల కొనసాగించి ఉంటే ఈ విద్యార్దులకు ఇన్ని కష్టాలు ఉండేది కాదు.గత వైసిపి ప్రభుత్వం హయంలో కూడా పాఠశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తు స్పందనలో వినతి పత్రం అందజేసిన స్పందన లేకుండా పోయింది.ఈ కొత్త ప్రభుత్వం అయిన విద్యార్థుల కష్టనీ గుర్తించి మెట్ట గూడ గ్రామాంలో పాఠశాల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.ఈ విషయం పై వ్రాతపూర్వకంగా మీ కోసం కార్యక్రమంలో పిర్యాదు చేస్తానని సర్పంచ్ నేటి గదర్ ప్రతినిధి కి తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి ప్రాణానికి ముప్పు వాటిలిన ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.