రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 13 :
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల హాస్టల్లో తొమ్మిదవ తరగతి ‘ బి’ సెక్షన్ విద్యార్థినులు తొమ్మిది మందికి ఎలుకలు కరవడం వల్ల అసౌకర్యం కలిగినందున వారిని ఆసుపత్రికి తరలించి తగిన వైద్యం అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.నిన్న పాఠశాలను మండల తహసీల్దార్ రజినీకుమారి ఆర్డీఓ సందర్శించి అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.పరిసర ప్రాంతాలను శుభ్రంచేసి కిటికీలకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలను నరికించడం జరిగిందని పేర్కొన్నారు.అలాగే ఎలుకలు లోపలికి రాకుండా గుమ్మానికి ఉన్న రంధ్రాలను సిమెంట్ తో మూసివేయడం,ఎలుకల బోన్లను ప్యాడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అదేవిధంగా విద్యార్థినిలు వేరే గదిలో నిద్రించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు..ప్రధానోపాధ్యాయులు మరియు 9వతరగతి ‘బి’ సెక్షన్ ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగిందన్నారు.హాస్టల్ ప్రధానోపాధ్యాయురాలు అనారోగ్యంతో ఉండడం వల్ల వారికి వైద్య సెలవులు మంజూరు చేశామని ఆ ప్రధానోపాధ్యాయుల స్థానంలో ఎం.పద్మ కు బాధ్యతలు అప్పగించడం జరిగిందని తెలిపారు.ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మండల స్పెషల్ ఆఫీసర్ ను అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ని వాళ్ళ ఫీల్డ్ విజిట్స్ లో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేయమని ఆదేశించడం జరిగిందని ఆయన తెలియపరచారు.