సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు.రైతు సోదరులు ,రైతు కూలీలు వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. ముఖ్యంగా చిన్న పిల్లలను బయటకు వెళ్లకుండా చూడాలని,పాత ఇళ్ళు,పాత గోడలు,డ్రైనేజీ ,చెరువులు,కరెంట్ స్తంభాలు వైపు వెళ్లకుండా చూడాలని తెలిపారు.రైతులు పొలాల్లో కరెంట్ స్తంభాలు ,మోటార్లు ముట్టుకోవద్దని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ళ నుండి బయటకు రావొద్దని, అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ తమకు తెలియజేయాలనీ,అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.