★24 లక్షల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం
★బోనాల ఉత్సవాల్లో భక్తులకు సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు
★వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు
★కుక్కల బెడద లేకుండ ప్రత్యేక చర్యలు, విద్యుత్ దీపాల ఏర్పాట్లు
నేటి గద్దర్ ప్రతినిధి మేడ్చల్ జిల్లా బ్యూరో:-
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ కార్యాలయంలో శనివారం అత్యవసర సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలు బోనాల పండుగా నిర్వహణ, నూతన విద్యుత్ దీపాలు, ఇంకా ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిపారు. 24 లక్షల రూపాయలతో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు కౌన్సిల్ ఏకగ్రీవంగా అమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాల్లో భక్తులకు సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని, అలాగే సీజనల్ వ్యాధులు రాకుండా ప్రత్యేకంగా ఫాగింగ్ మరియు దోమల నివారణ చర్యలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని, అలాగే కుక్కల బెడద లేకుండా కుడా ప్రత్యేక చర్యలు,విద్యుత్ దీపాల ఏర్పాటు చేస్తున్నామని, అలాగే మున్సిపల్ వాహనాలకు జిపిఎస్ సిస్టంను అమరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ రెడ్య నాయక్, కమీషనర్ పశ్య వేమన రెడ్డి, కౌన్సిలర్లు గోంగాళ్ళ మహేష్, సింగిరెడ్డి సాయిరెడ్డి, బలగోని వెంకటేష్ గౌడ్, బెజ్జoకి హరి ప్రసాద్ రావు, సర్వీు రవీందర్,సామల శ్రీలత, అబ్బావతి సరితా, మోటుపల్లి పోచమ్మ,సుర్వీ సుద లక్ష్మి , ఏ ఈ మహిపాల్, శానిటరీ ఇన్స్పెక్టర్ వాణి మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.