సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్)
సమీకృత కలెక్టరేట్ సముదాయంలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ రాహుల్ రాజ్.
6 గ్యారంటీల పథకాల గురించి గతంలో దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలను నివృత్తి చేసుకోవచు.
మెదక్ కలెక్టరేట్ లోని ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రజా పాలన సేవా కేంద్రంలో ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీ పథకాల సంబంధించి గతంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల లోటుపాట్లు సవరించుకోవచ్చని చెప్పారు.
నూతనంగా ప్రారంభించిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆన్లైన్ లో వివరాలు నమోదు చేసే విధానాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఈ,డిస్టిక్ మేనేజర్ సందీప్ మరియు సంబంధిత పంచాయతీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.