◆వాజేడు ఏజెన్సీలో రాకాసి మత్తు
◆పట్టపగలే మత్తు కొడుతూ పట్టుబడ్డ యువత
◆ముగ్గులు వ్యక్తులు అరెస్ట్
నేటి గద్దర్ వాజేడు
ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామం చివర్లో ముగ్గురు వ్యక్తులు జవ్వ గణేష, టేకులగూడెం గ్రామం, మారబోయిన శివరామకృష్ణ, కనకునూరు గ్రామం, దాట్ల శ్రావణ్ కుమార్, కనుకునూరు గ్రామం, వారు గంజాయి సేవిస్తున్నారని విశ్వసనీయ సమాచారంతో పేరురు ఎస్సై పై అధికారుల ఆదేశాల మేరకు వెళ్లారు. ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా అదుపులోకి తీసుకొని వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. విచారణలో అసలు సిసలైన వాస్తవాలు తెలుగులోకి వచ్చాయి. మాతో ఇంకో ఐదుగురు ఉన్నారని, మేమంతా గంజాయి త్రాగడం వల్లనే ఫ్రెండ్స్ అయ్యామని, వారి దగ్గర నుండి 168 గ్రాముల గంజాయి,4200 రూపాయలు, స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కుమార్ తెలిపారు. వెంకటాపురం వాజేడు ఏజెన్సీలో యువతరం మత్తులో చితవుతున్నారని, పట్టపగలే గంజాయి తాగుతున్నారని బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని,యువతరం మత్తు మాయలో పడవద్దు అని ప్రభుత్వ నిషేధిత గంజాయి త్రాగిన విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.