సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్)
పెండింగ్ కేసులపై సమీక్ష సమావేశం,
ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పని చేయాలి,
ధరఖాస్తు పట్టదగినదైతే కచ్చితంగా కేసు నమోదు చేయాలి
కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి,
జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. సిబ్బందితో నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.మాట్లాడుతు.. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన గ్రేవ్ నాన్ గ్రేవ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి ఏ ఏ అంశాలు క్రోడికరించాలి తదితర అంశాల గురించి వివరించారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో పని చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. పూర్తి పారదర్శకంగా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాలి. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. లాంగ్ పెండింగ్ కేసులు త్వరగా చేదించాలి, కేసుల చేదనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలి, అలాగే NBWల అమలు మరియు పెండింగ్ వాటి వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. రిసెప్షన్, క్రైమ్, స్టేషన్ రైటర్, కోర్టు డ్యూటీ ఆఫీసర్, తదితర విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేస్తూ వారి యొక్క పనితనాన్ని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలి. సైబర్ నేరాల నియంత్రణ గురించి సిసి కెమెరాల ఆవశ్యకత గురించి గ్రామాలలో పట్టణాలలో విజిబుల్ పోలిసింగ్ ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ శ్రీ.మహేందర్,మెదక్ డి.ఎస్.పి శ్రీ.రాజేష్, డి.సి.ఆర్.బి సిఐ శ్రీ.మధుసూదన్ గౌడ్ , ఎస్.బి.సి.ఐ.శ్రీ.సందీప్ రెడ్డి, సి.ఐ.లు, ఎస్.ఐ.లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.