నేటి గదర్ న్యూస్,ములకపల్లి ప్రతినిధి:
ములకలపల్లి మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల ను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ ప్రతినిధి బృందం పలుసమస్యలను వెలికి తీసింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ వరక అజిత్ మాట్లాడుతూ ములకలపల్లి మండల కేంద్రంలో సుమారు చుట్టుపక్కల 40 గ్రామాల నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విద్యార్థులు వస్తుంటారని తిరిగి సదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే సరైన రవాణా మార్గం గానీ ఇతర సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో బాలబాలికలకు పోస్టుమెట్రిక్ హాస్టల్స్ ఏర్పాటు చేయాలని అజిత్ ప్రభుత్వన్ని డిమాండ్ చేసారు
అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు పేద మరియు గిరిజన విద్యార్థులని ములకలపల్లి మండల కేంద్రంలో ఎస్టి పిఎంహెచ్ గర్ల్స్ ఎస్ టి పి ఎం హెచ్ బాయ్స్ హాస్టల్స్ ను ఏర్పాటు చేస్తే ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని ఉన్నతాధికారులు. I. T. D. A. P. O. గారు వెంటనే స్పందించి హాస్టల్ వసతి గృహాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు , అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తరగతిగదికి సరిపడాలని ఫ్యాన్లు లైట్లు,మరియు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఉన్నత అధికారులు స్పందించి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నవీన్,ప్రభాస్,రవి,కల్యాణి,యామిని,కావ్య,బిందు, తదితరులు పాల్గొన్నారు