★మంత్రి పొంగులేటి చొరవతో కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు..
■ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ
■ఈ విద్యా సంవత్సరం నుండే అందుబాటులోకి
★సోమవారం నుంచి అడ్మిషన్ల ప్రారంభం
నేటి గదర్ న్యూస్ , జులై 20 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు)
ఆయన మాట ఇస్తే శాసనమే…చేస్తా అన్న ,ఇస్తా అన్న అక్కడితో ఆగేదేలే.. చిన్న చిరునవ్వు నవ్వుతూ అందరి సాదక బాధలు విని వదిలేసే ప్రసక్తే లేదు…అందుకే ఎన్నో ఏళ్ల నాటి ప్రభుత్వం జూనియర్ కళాశాల ఏర్పాటు,తరగతుల ప్రారంభం కానుంది…. బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకముందే పాలేరు నియోజకవర్గాన్ని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనల చేయడం, మున్నేరుకు కరకట్ట నిర్మాణ పనులను ప్రారంభించడం , చెక్ డ్యాంల ఏర్పాటు అదేవిధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు శాశ్వత భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి చొరవ నేపథ్యంలో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కూసుమంచి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కు ఆదేశాలు ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 ఏడాది నుంచే కళాశాల అందుబాటులోకి రావాలని ఆ జీవోలో పేర్కొన్నారు. ఈ నెల 22 సోమవారం నుంచి విద్యార్థినీ,విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కూసుమంచిలో కళాశాల ఏర్పాటు పట్ల పాలేరు నియోజకవర్గానికి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.