నేటి గదర్ న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి:
ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్.హెచ్.ఎం.ఆల్ క్యాడర్స్ మీటింగ్ సమావేశం మధ్యాహ్నం 12 గంటలకు మైనార్టీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరుగుతుందని కావున ఉద్యోగులు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరు. జాతీయ ఆరోగ్య మిషన్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు భోగే ఉపేందర్ మరియు ఎన్ హెచ్ ఎం ప్రధాన కార్యదర్శి బి. మధుకర్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ (ఏఐటియుసి అనుబంధం)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా , ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్స్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎల్.సురేష్ నాయక్ , NHM కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ దేవనబోయిన బాపు యాదవ్ మరియు జనగాం జిల్లా ఎన్ హెచ్ ఎం ఆల్ క్యాడర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కొండ్ర లత , పాల్గొంటున్నారనీ వారు పేర్కొన్నారు