– నేటి రాత్రికి కిన్నెరసాని లో మరో మూడు గేట్లు ఎత్తివేత
– అప్రమత్తమవుతున్న అధికారులు
నేటి గదర్, జూలై 20,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
అలవాల వంశీ, 9052354516 :
ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి క్రమక్రమంగా ఉగ్రరూపం దాల్చుతూ వేగంగా నీటిమట్టం పెరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి వరద నీరు రావడం మొదలవుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ప్రాజెక్టులో నిండుకుండల్ల తొణికిసాడుతుండడంతో ఆయా ప్రాజెక్టుల నుండి గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా ఇప్పటికే తాలుపేరు ప్రాజెక్టు నుండి 25 గేట్లను ఓపెన్ చేసి 1,38,406 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. అదేవిధంగా సమ్మక్క బ్యారేజ్ వద్దనుండి గేట్లను తెరిచి నీటిని దిగువకు వరద నీటిని దిగువకు వదులుతున్నారు. వద్ద దీనితో వరద ఉధృతి మరింత తీవ్ర రూపం దాల్చుతుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయానికి 34.40 అడుగులు ఉన్న గోదావరి, 4 గంటల సమయానికి 34.90 అడుగులకు చేరింది. సాయంత్రం 5 గంటలకు 35.10 అడుగుల వద్ద ప్రవహిస్తూ, 6 గంటల సమయానికి 35.30 అడుగులు, 7 గంటల సమయానికి 35.40 అడుగులు, 8 గంటల సమయానికి 35.50 అడుగుల వద్ద ప్రవహిస్తూ రాత్రి 9 గంటల సమయానికి 37.70 అడుగులకు చేరుకుంది. నీటి ప్రవాహం కొంతమేరకు వేగంగా కొంతమేరకు వేగం తగ్గించుకుంటూ గంట గంటకు పెరుగుతూనే ఉంది. ఈరోజు రాత్రికి కిన్నెరసాని డ్యాం నుండి మరో మూడు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదలను ఉన్నట్లు అధికారులు ఒక పథకంలో తెలిపారు.
– అప్రమత్తమవుతున్న అధికారులు
గోదావరి నీటిమట్టం గంటకు పెరుగుతూ లంక గ్రామాలను వరద తాకే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలతో అప్రమత్తమవుతున్నారు. ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల పరిస్థితులను తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బూర్గంపాడు మండలంలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో శనివారం పాల్వంచ డిఎస్పీ ఆర్.సతీష్ పర్యటించారు. మోతే, ఇరవండి గ్రామాలలో పర్యటించిన ఆయన గ్రామస్తులతో మాట్లాడుతూ… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు గోదావరిలో చాపలు వేటకు వెళ్లవద్దని సూచించారు. అనంతరం గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేవిధంగా బూర్గంపాడు ఎస్సైలకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు ఎస్సై రాజేష్, అదనపు ఎస్ఐ నాగబిక్షం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.