★రెండు గంటలు ఐన లభించని ఆ యువకుని ఆచూకీ
★బయటపడ్డ మరో వ్యక్తి
★గాలింపు చర్యలు పర్యవేక్షణ చేస్తున్న ఏడుల్ల బయ్యారం ఎస్సై రాజకుమార్
నేటి గదర్ న్యూస్,పినపాక: భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ శాఖ ఎన్ని హెచ్చరికలు చేసినప్పటికీ ప్రజలలో మార్పు రావడం లేదు. చేపల వేటకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. మొన్న వెంకటాపురం మండలంలో జరగగా నేడు ఆదివారం పినపాక మండలంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పినపాక మండలం పోట్లపల్లి గ్రామానికి చెందిన బడే నాగరాజు, పాయం నగేష్ ఇద్దరు కలిసి చేపలు పట్టేందుకు పొట్లపల్లి వాగు చెక్ డాం వద్దకు ఆదివారం ఉదయం వెళ్లారు. చెక్ డాం లోకి దిగి చాపలు పడుతుండగా వరద ప్రవాహం అధికం కావడంతో పాయం నగేష్ వరదలో కొట్టుకొని పోయాడు. బడే నాగరాజు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెండు గంటలు గడిచినప్పటికిని ఆ యువకుడి ఆచూకీ లభించలేదు.