ఎస్సీ ఎస్టీ, బిసి వసతి గృహాల్లో ఆర్.ఓ.ఆర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి.
నేటిగదర్ న్యూస్ జులై21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.
కొణిజర్ల మండలం.తనికెళ్ల
ఎస్సీ, ఎస్టీ ,బీసీ హాస్టల్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మెనూ పెంచాలని, ప్రతి వసతి గృహంలో తాగునీటి కొరకు ఆర్.ఓ.ఆర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వైరా నియోజకవర్గం ఇన్చార్జి భూక్యా వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు మధ్యాహ్నం తనికెళ్ల ఎస్సీ బాలుర వసతి గృహానికి తనికెళ్ల సిపిఎం గ్రామ కార్యదర్శి అన్నవరపు వెంకటేశ్వర్లు తో కలిసి సందర్శించారు, విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసి, అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల క్రితం పెంచిన మెనూ తప్ప ఇప్పటివరకు పెంచకపోవడం తో నిత్యవస ధరలు, సరుకులు ,విపరీతంగా పెరిగిపోయాయని గుర్తు చేశారు, వచ్చే అసెంబ్లీ సమావేశంలో దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల వసతి గృహాల సమస్యలపై చర్చించి, మెనూ పెంచి, తగిన స్థాయిలో అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. విద్యాభివృద్ధి పై తగిన స్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు, బలహీన వర్గాలకు విద్యాభివృద్ధికి కృషి చేయకపోతే భవిష్యత్తులో ఆసమానతలు తీవ్ర స్థాయిలో అంతరాలు ఏర్పడే ప్రమాదం ఉందని, దీనిని ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ విద్య అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూ ను స్థానిక వార్డెన్ కొత్త వెంకటేశ్వర్లు అడిగి తెలుసుకున్నారు, ఆయనతోపాటు పార్టీ మండల నాయకులు గ్రామ కార్యదర్శి అన్నవరపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.