సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్)
వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మాతా,శిశు సంరక్షణ కేంద్రం కలెక్టర్ పరిశీలించారు ఆదివారం జిల్లా కలెక్టర్ వైద్యఆరోగ్యశాఖ అధికారులతో కలిసి మాతా,శిశు సంరక్షణ కేంద్రంలో బాలింతలతో మాట్లాడి ఆసుపత్రుల్లో ప్రసవాల తీరును తెలుసుకున్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వేలాది రూపాయల ఫీజులను ప్రసవాల కొరకు ఖర్చు చేయలేరని ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉచితంగా సాధారణ ప్రసవాలు జరుగుతాయి కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు ఎక్కువ జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు పేషెంట్లకు వసతి సౌకర్యం సరిపోవటం లేదని గుర్తించి అదనపు వసతి ఏర్పాటు చేయాలని సూపరిండెంట్ ను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ రవీంద్ర కుమార్ ఆర్ఎంఓ కిరణ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 266