+91 95819 05907

ఐదుగురు నకిలీ విలేకరులను అరెస్టు చేసిన కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు

నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

ఈ నెల 17న కొత్తగూడెం సన్యాసిబస్తి లో దాసరి సాంబశివరావు కు దూరపు బందువు అయిన దాసరి పూర్ణ అను ఒక ఆడ మనిషిని అక్రమ సంబంధం పెట్టుకున్నదనే అనుమానంతో తన భర్త కొట్టి చంపినాడు.అట్టి విషయంలో వారి కుటుంబ సభ్యులను అక్రమ సంబంధం వలన మర్డర్ చేసారని పేపర్ ప్రచురిస్తామని బెదిరించి వారి దగ్గర ఎలాగైనా డబ్బులు తీసుకోవాలని ఐదుగురు వ్యక్తులు ఆ కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాలపడ్డారని వన్ టౌన్ సీఐ కరుణాకర్ వెల్లడించారు.మృతురాలి కుమారుడైన కార్తిక్ కు శ్రీనివాస్ అను వ్యక్తి ఫోన్ చేసి రిపోర్టర్ అని చెప్పి మీ తల్లి గారు అక్రమ సంబంధాలు పెట్టుకున్నది అందుకే మీ నాన్న మీ తల్లిని చంపాడని,పేపర్లో ఆ విషయాన్ని రాయకుండా ఉండాలంటే మాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని బెదిరించాడని వివరాలు తెలిపారు.ఆ తరువాత మళ్ళీ ఫోన్ చేసి మా మనుషులు మీ ఇంటికి వచ్చి మిగిలిన విషయాలు మాట్లాడుతారు అని చెప్పి ఫోన్ పెట్టేసినాడు.అదే రోజు రాత్రి సుమారు 9 గంటలకు దాసరి కార్తీక్ ఇంటి దగ్గరకు శ్రీనివాస్ మరియు దాసరి సాంబశివరావు మరియు మరో ముగ్గురు వ్యక్తులు అయిన రమేష్,రాజేష్,గణేష్ లు వెళ్లి పత్రికా విలేకరులమని చెప్పి బెదిరించి డబ్బుల కోసం బెదిరించారని విచారణలో తేలిందన్నారు.కానీ అతను డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వారు తిరిగి వచ్చేసినారు.అనంతరం బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరు అయిదుగురుపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

విలేకరులమని బెదిరించిన వ్యక్తులైన ఈ క్రింది వారిని అరెస్ట్ చేయడమైనది

1.ఏలూరి రాజేష్ కుమార్ S/o నరసయ్య, వయసు: 38 సం,వృత్తి: Pvt job, R/o H.No.149/1 శ్రీనగర్ కాలనీ 5 లైన్ లక్ష్మీదేవి పల్లి.

2.దాసరి సాంబశివరావు @ సాంబ S/o వెంకటేశ్వర్లు, వయస్సు: 35 సంవత్సరములు,వృత్తి: రిపోర్టర్ R/o H.No 9-5-107 బర్లి ఫీట్ కొత్తగూడెం.

3.గుంటూరు శ్రీనివాసరావు S/o వీరాస్వామి, వయస్సు: 54 సం, వృత్తి: ఓ పిడిఎఫ్ పత్రిక విలేకరి, R/o H.No: 6-8-22 హౌసింగ్ బోర్డ్ కాలనీ, చుంచుపల్లి మండలం.

4.మేకల రమేష్ S/o సమ్మయ్య, వయస్సు: 40 సంవత్సరాలు,వృత్తి: ఫోటోగ్రాఫర్, R/o Q. No: MD-3, 9F-4, మిలీనియం క్వార్టర్స్ రుద్రంపూర్.

5.బాధావత్ గణేష్ S/o బాలు, వయసు:23 సం, వృత్తి: టీ మాస్టర్ రాయల్ టీ స్టాల్ కొత్తగూడెం, R/o మేధర బస్తి కొత్తగూడెం.

కొత్తగూడెం పట్టణంలో కొంతమంది వ్యక్తులు విలేకరులమని చెబుతూ ఒక ముఠాగా ఏర్పడి సామాన్య ప్రజలను డబ్బుల కోసం వేధిస్తున్నారని తమ దృష్టికి వస్తుందని,దీనివలన నిజాయితీగా విలేకరులుగా పనిచేసే వారికి చెడ్డపేరు వస్తుందని 1టౌన్ సీఐ అన్నారు.ఎవరైనా విలేకరులమని చెప్పి ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !