– జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్
నేటి గద్దర్ అల్లూరి జిల్లా న్యూస్:
పాడేరు, జూలై 22: జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా నేడు సోమవారం కూడా స్థానిక సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులు 19, 20 తేదీలలో స్థానిక సెలవు ప్రకటించిన విషయం విధితమే. ప్రస్తుతము ఇంకా వర్షాలు తగ్గ ముఖం పట్టనందున రేపు సోమవారం కూడా సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే చింతూరు డివిజన్లో ముంపు మండలాలైన చింతూరు, ఎటపాక, వి.ఆర్ పురం, కూనవరం మొదలగు నాలుగు మండలాల్లో 23వ తేదీ మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి చింతూరు డివిజన్ మినహా మిగిలిన 18 మండలాల్లో సోమవారం సెలవుగా భావించి తమ పిల్లలను పాఠశాలలకు పంపవద్దని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా చింతూరు డివిజన్లోని నాలుగు మండలాలకు సోమవారం మంగళవారం సెలవు ప్రకటించినందున వారి పిల్లలను పాఠశాలకు పంపవద్దని కలెక్టర్ కోరారు.