★భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
ఏటూరు నాగారం ఎఎస్పీ శివం ఉపాధ్యాయ
నేటి గదర్ న్యూస్, ఏటూరు నాగారం:
భారీ వర్షపాతం ప్రస్తుత వాతావరణం దృశ్య ఏటూరు నాగారం సబ్ డివిజన్ పరిధిలో దిగువ స్థాయి వంతెనలపై నీటి కారణంగా రోడ్డు కోతకు గురవుతుంది. జంపన్న వాగు కారణంగా. కొండాయి మల్యాల చల్పాక ఎలిసెట్టి పల్లి రోడ్డు పోలీస్ అధికారులు అడ్డగించడం. జరిగింది సప్త వాగు నీటి కారణంగా రోహిరు అల్లవారి ఘనపురం. కన్నయ్య గూడెం మండలంలో ఐలాపూర్ రోడ్డు బ్లాక్ చేశారు. పేరూరు మండలంలో 123 జాతీయ రహదారి టేకులగూడెం గ్రామం మధ్య తక్కువ స్థాయి వంతెన రేగి మాకు వాగు. చుండ్రుపట్ల ఎక్స్ రోడ్డు నుండి పేరూరు మధ్య అంతర్గత రహదారి లో లెవెల్ వంతెన మర్రివాగు అడ్డగించారు. వెంకటాపూర్ మండలంలోని కలిపాక గ్రామం పెంకవాగు పూర్తిగా తెగిపోయింది. వెంకటాపురం నుండి మల్లాపురం మధ్య కంకాల వాగుతో అంతర్గత రహదారి బ్లాక్ చేయడం జరిగింది. వాజేడు ఏడిజెర్లపల్లి బొమ్మనపల్లి రహదారి మధ్య అంతర్గత రహదారి లోలీలు వంతెన బొమ్మనపల్లి వాగు ఇప్పగూడెం ఎక్స్ రోడ్ నుండి వాజేడు వరకు ఇంటర్నల్ రోడ్డు లో లేవు వంతెన కొంగల వాగు బొమ్మనపల్లి వాగు హోసూర్ నుండి బొమ్మనపల్లి గ్రామం వరకు అంతర్గత లో లెవెల్ వంతెన లనూ ఏటూరు నాగారం ఎఎస్పీ శివం ఉపాధ్యాయ ముందస్తు చర్యల్లో భాగంగా రోడ్లను బ్లాక్ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలకు పలు సూచనలు చేశారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మంగపేట మండలంలోని నరసింహసాగర్ గ్రామపంచాయతీ శనగకుంట పరిధిలోని కుండలి గొర్రె ఉప్పొంగి ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో శనిగ కుంట గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఆ గ్రామంలో 144 ఇల్లు ఉండగా జ్వరాలతో 20 కుటుంబాల వరకు బాధపడుతున్నారు. రాజుపేట ముసలమ్మ వాగు ఉధృతికి భూమి కోతకు గురి అవుతుంది. బోగత జలపాతం ఉధృతంగా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది.
వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ఆయా మండలాల పరిధిలో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలోగల రాళ్లవాగు బ్రిడ్జి తెగిపోయినందున ఘనపూర్ వెళ్లేవారు అబ్బాపూర్ లేదా వెంకటాపురం మీదుగా వెళ్ళవలసి ఉంటుంది.
బొగ్గుల వాగు మీదుగా జగ్గన్నగూడెం వెళ్లేవారు సర్వాపూర్ నుండి హై లెవెల్ బ్రిడ్జి గుండా అంకన్నగూడెం ద్వారా జగ్గన్నగూడెం వెళ్లాలి.
దేవగిరిపట్నం నుండి అన్నంపల్లి మధ్యలో రోడ్ మీద కూడా లో లెవెల్ కాజువే పైన వాటర్ ప్రవాహం ఉన్నందున అట్టి కాజువే ను ఎవరు దాటుటకు ప్రయత్నం చేయవద్దు.
అలాగే ఊర్ల లో ఉన్న చిన్న చిన్న కాజువే ల పైన కూడా అకస్మాత్తుగా వరద పెరిగే అవకాశం ఉన్నందున దయ చేసి ఎవరు కూడా నీటి ప్రవాహం అంచనా వేయకుండా దాటడానికి ప్రయత్నం చేయకూడదు
వెంకటాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో మోరాంచావాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున గుర్రంపేట రోడ్డు తెగిపోయింది కావున వీరు వెలుతుడ్లపల్లి నుండి అప్పయ్య పల్లి సీతారాంపురం కొండాపూర్ వెళ్లే గ్రామ ప్రజలు వెళ్తుర్లపల్లి జంక్షన్ గుండా వయా ఘన్పూర్ వెళ్ళాలి బూర్గుపేట వెళ్లే వాళ్ళు పాలంపేట మీదుగా ఘనపూర్ వెళ్ళాలి .
లింగాపూర్ నుండి NH 163 గుండా జవహర్ నగర్ వెళ్లే దారిలో వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తున్నందున వీరు లింగాపూర్ నుండి వెంకటాపూర్ లేదా జంగాలపల్లి గుండా NH 163 వ రహదారికి చేరుకోవాలి
★ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
వరద ఉధృతి పొంగుతున్న వాగులు వంకలను ఆదివారం పోలీస్ అధికారులు పరిశీలించారు . ములుగు జిల్లాలో అరేంజ్ అలర్ట్ ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసిందన్నారు. జిల్లా పోలసు అధికార యంత్రాంగం ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్నాo అన్నారు
అత్యవసర పరిస్థితుల్లో 100కి ఫోన్ చేయాలని. స్థానిక పోలీస్ అధికారులు కు సంప్రదించాలని కోరారు