నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. ఖమ్మం పట్టణంలో సేవాలాల్ సేన మహాసభలు ఖమ్మం నగరంలోని టిటిడిసి ఫంక్షన్ హాల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా సేవాలాల్ సేన అధ్యక్షులు బానోత్ శ్రీకాంత్ నాయక్ మరియు ఖమ్మం నగర పెద్దతండ వాసిగా ఉన్న గూగులోత్ రాజ్ కుమార్ నాయక్ ను ఉపాధ్యక్షుడిగా,అలాగే ఖమ్మం జిల్లా యువజన అధ్యక్షుడిగా బానోత్ బాలకృష్ణ నాయక్ ను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముందుగా ఖమ్మం పట్టణం లో భారీ ర్యాలీ ని యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.రాష్ట్ర,జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ్ నాయక్ నన్ను నమ్మి నా పై ఖమ్మం జిల్లా యువజన భాద్యతలు పెట్టినందుకు సేవాలాల్ సేన తరుపున బంజారా యూత్ కి అన్ని వేళల అందుబాటులో ఉంటూ వారికీ చేయూతనిస్తానని బాలకృష్ణ నాయక్ నేటి గదర్ ప్రతినిధి తో తెలిపారు.రాష్ట్ర, జాతీయ నాయకులు చేతుల మీదుగా సేవాలాల్ సేన జిల్లా యూత్ అధ్యక్షులు గా పత్రంను అందుకోవడం చాలా సంతోషంగాను,చాలా గర్వంగా ఉందని వారు తెలిపారు.తనను నమ్మి తనకు సహకరించిన మిత్రులకు, ప్రోత్సహించిన తెలంగాణ రాష్ట్ర సేవాలాల్ సేన రైతు సంఘ అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్ కు, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో సేవలాల్ సేన జిల్లా, మండల నియోజకవర్గ నాయకులు, భూక్య సంజీవ నాయక్,బానోత్ కిషన్ నాయక్, శ్రీకాంత్ నాయక్, రాజ్ కుమార్ నాయక్, పాలేరు నియోజకవర్గం సేవాలాల్ సేన సోషల్ మీడియా ఇన్ఛార్జి అధ్యక్షులు భూక్యా రాజేష్, రాథోడ్,బానోత్,పృథ్వి నాయక్, భద్రు నాయక్, రాజు నాయక్, కొర్ర సురేష్ నాయక్, హలవత్ సురేష్ నాయక్,నెహ్రూ నాయక్ కృష్ణా నాయక్ ప్రసాద్ నాయక్ గిరిజన సంఘ నాయకులు సేవలాల్ సేన అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.