కాంగ్రెస్ నాయకులు బట్టా విజయ గాంధీ
నేటి గదర్, జూలై 23,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో(భూర్గంపాడ్),
అలవాల వంశీ, 9052354516 :
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్ధిక బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం నాయకులు బట్టా విజయ గాంధీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణపై కేంద్రానికి ఉన్న వివక్షతను మోడీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో సుస్పష్టం చేసిందని, తెలంగాణ రాష్ట్రం నుండి 8మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు సహాయక మంత్రులు ఉన్నప్పటికీ స్వరాష్ట్రానికి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారని, బిజెపి ఎంపీలు తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణపై కేంద్రం సవితిప్రేమ చూయిస్తూ, పార్లమెంట్ సాక్షిగా నిర్లక్ష్యధోరణి చూయించిందనడంలో ఇంతకన్నా మరో సాక్ష్యం అవసరంలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజాగ్రహానికి గురికాకతప్పదని ఆయన హెచ్చరించారు. త్వరలోనే కేంద్రంలో సైతం INDIA కూటమితో కూడిన ప్రజాప్రభుత్వం కొలువుదీరనుందని ప్రకటనలో పేర్కొన్నారు.