+91 95819 05907

ప్రజలు 8MP సీట్లు ఇస్తే… బిజెపి గుండు సున్నా ఇచ్చింది : మహమ్మద్ ఖాన్

– బిజెపి రాష్ట్రానికి ఏమీ ఇవ్వదు కానీ.. బిజెపికి మాత్రం తెలంగాణ సీట్లు ఓట్లు కావాలి

నేటి గదర్, జూలై 24,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో,
అలవాల వంశీ 9052354516 :

ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు 8 MP సీట్లను ఇస్తే… అందుకు బదులుగా బిజెపి తెలంగాణ ప్రజలకు గుండు సున్నా ఇచ్చిందని భద్రాద్రి కొత్తగూడెం డిసిసి మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బిజెపి తెలంగాణకు ఏమీ ఇవ్వదు కానీ బిజెపికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు కావాలి.., సీట్లు కావాలి.. అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంపై నరేంద్ర మోడీ ఎప్పుడు విషం జిమ్ముతున్నే ఉన్నారని, రాష్ట్ర ఏర్పాటు సైతం సరిగా జరగలేదని ఆ విషయం సైతం ప్రధాని మరచిపోయారని విమర్శించారు. బడ్జెట్ ప్రకటన సమయంలో తెలంగాణ ఊసే తీయలేదని, విభజన చట్టంలో ఉన్న హామీల గురించి సైతం నోరు మెదపలేదని మహమ్మద్ ఖాన్ దుయ్యబట్టారు. మోడీ మన రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిండు అని ఎన్నికల సమయం లో కాంగ్రెస్ పార్టీ పదే పదే మొత్తుకుందని, అదే నేడు నిజం అయ్యిందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి మీరు ఏమి ఇవ్వరు…కానీ మీకు తెలంగాణలో సీట్లు, ఓట్లు కావాలా..? అంటూ ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో BRS కు పట్టిన గతి… రానున్న స్థానిక సంస్థల్లో బిజెపి కూడా పడుతుందనే విషయం బిజెపి గుర్తుపెట్టుకోవాలని ఆయన అన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !