ఆ బోరు వాటర్ మాకు వద్దు బాబోయ్..
కాస్త పట్టించుకోండి అని వేడుకోలు..
నేటి గదర్ న్యూస్ , జులై 24 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు):
ఆ బోరు నీళ్లు మాకు వద్దు బాబోయ్ అంటున్నారు దళిత కాలని వాసులు… కూసుమంచి మండలం తురకగూడెం ఎస్సీ కాలనీ వాసులు బోరు నీళ్లు వాడడం వల్ల స్కిన్ ఎలర్జీ వస్తుందని అంటున్నారు. ఆ ఎస్సీ కాలనికి దగ్గరలోని స్మశాన వాటికలో వేసిన బోరు నుండి వాటర్ సరఫరా చేస్తున్నారు. ఆ నీళ్ళతో స్నానం చేయడం వలన కాలని వాసులకి వంటిపై బురదలు వచ్చి స్కిన్ ఎలర్జీ వస్తుందని బాధను వ్యక్తం చేస్తున్నారు.. ఆ నీళ్లు మాకు వద్దు అంటున్నారు.. గతంలో పాలేరు నుండి వచ్చే వాటర్ సరఫరాను కాలనికి ఆపేసి కొత్తగా బోరు వాటర్ ను సరఫరా చేస్తున్నారు. ఆ నీళ్ళతో స్నానం చేసిన తర్వాత ఎలర్జీ మొదలైనట్టు చెపుతున్నారు. ఇదే విషయాన్ని గ్రామ పంచాయితీ సెక్రటరీకి అనేక మార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని.. మరల అదే బోరు వాటర్ సరఫరా చేస్తున్నారని చెపుతున్నారు.. ఆ బోరు నుండి వచ్చే వాటర్ లో ఫ్లోరైడ్ ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు… వెంటనే బోరు వాటర్ ను ఆపేసి పాలేరు వాటర్ ను సరఫరా చేయాలని కోరుతున్నారు..