★యూజీసీకి భారీగా తగ్గిన నిధులు
★గత బడ్జెట్లో ఇచ్చిన కేటాయింపుల ప్రస్థావన లేదు, ఉన్నత విద్యను ప్రైవేట్ పరం చేసి, కార్పోరేట్ కు ఊడిగం చేసేందుకే ఈ బడ్జెట్
★ నూతన విద్యావిధానం-2020 అమలు అంటూనే, కనీసం ఎన్.ఇ.పి ప్రస్తావించిన బడ్జెట్ కేటాయింపులు లేవు
★AISF జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ
నేటి గదర్ న్యూస్, జూలూరుపాడు : కేంద్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ విద్యారంగానికి తీవ్ర మొండి చెయ్యి చూపించింది. దేశంలో విద్యాభివృద్ధి కోసం కనీసం కేటాయించాల్సిన నిధులను కేటాయించలేదు.
గత ఓటాన్ బడ్జెట్లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు , ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు కేవలం 0.1 మాత్రమే బడ్జెట్ ను పెంచారు. బడ్జెట్ మొత్తంలో పెరిగినట్లు ఉన్న గతం కంటే విద్యారంగానికి బడ్జెట్ తగ్గింది. గత మొత్తం బడ్జెట్ 45,03,638 కోట్ల నుండి 48,21,000 కోట్లకు పెరిగింది. అంటే 7 శాతం బడ్జెట్ పెరిగింది. కానీ విద్యారంగానికి తీవ్రంగా నిధులను తగ్గింపు చేశారు.
గత ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ లో విద్యారంగానికి 1,12,899(2.5%) కోట్లు బడ్జెట్ కేటయింపులు చేసిన కేంద్రం లో నాడు బడ్జెట్ లో ప్రతిపాదించిన డిజిటల్ గ్రంథాలయం నిధులు, జాతీయ విద్యా మిషన్ నిధులు, ఏకలవ్య పాఠశాలలో టీచర్ పోస్టులు భర్తీ, 157 నర్సింగ్ కళాశాలలు,ఐటీఐ లకు బడ్జెట్ వంటి అంశాలను ప్రస్తావనే లేదు గత నిధులు పూర్తిగా ఖర్చు చేయకుండా పేపర్ పైనే బడ్జెట్ ను చూపిస్తుంది.
ఉన్నత విద్యా సంస్థలు కేంద్ర విశ్వవిద్యాలయాలు అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే యు జి సి కి భారీగా నిధులు కోతపెట్టారు గత బడ్జెట్లో యు జి సి కి 5360 కోట్లు కేటాయించగా క్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తున్నారు.
2023 లో యు జి సి కి 6409 కోట్లు రూపాయలు మాత్రమే యుజిసికి కేటాయించారు.
కేంద్ర యూనివర్సిటీలకు గతం కంటే స్థూలంగా నిధులు పెంచారు గత బడ్జెట్లో 14,903.87 కోట్లు కేటాయింపులు చేస్తే ప్రస్తుతం 15,928 కోట్లు కేటాయించారు.
సెంట్రల్ యూనివర్సిటీ నూతన భవనాలు ఫెలోషిప్ పెంపు హాస్టల్స్ నిర్మాణం గురించి అభివృద్ధికి నిధుల ప్రస్తావన లేదు. ఐఐటీలను గత బడ్జెట్లో 9661.50 కోట్లు ఈ బడ్జెట్లో 10,324.50 కోట్లు కేటాయింపులు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ గురించి, పరిశోధనలకు ప్రత్యేక నిధులు కేటాయింపులు గురించి, ఈ బడ్జెట్ లో ప్రస్తావన తీసుకొని రాలేదు. – – -ఎన్ఐటీలకు గత సంవత్సరం 4820.60 కేటాయిస్తే ఈ సంవత్సరం 5040 కోట్లు -ఐఐఎస్ ఆర్ గత సంవత్సరం 815.40కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 918.27 కోట్లు కేటాయించారు.- ఐఐఎస్ ఆర్ లకు గత సంవత్సరం 1462 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 1540 కోట్లు కేటాయించారు.
అంటే పరిశోధనలకు ప్రధాన కేంద్రాలైన ఈ విద్యా సంస్థలలో నిధులను అభివృద్ధికి మౌలిక సదుపాయాల కోసం కాకుండా వాటి నిర్వహణ కోసం మాత్రమే కేటాయిస్తుంది.
దేశంలో పాఠశాల విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఆసర్ రిపోర్ట్, ఆసోచామ్ రిపోర్టులు దేశంలో ఒక లక్ష టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని,సరైన మౌలిక సదుపాయాలు లేవని, టాయిలెట్స్ ,భవనాలు కనీసం కరెంట్ సౌకర్యం లేకుండా ఉన్నాయని నివేదికలు చెబుతుంటే,
బడ్జెట్లో మాత్రం పాఠశాల విద్యకు గత బడ్జెట్లో 68,804.85 కేటాయిస్తే ఈ సంవత్సరం 71,50893 కోట్లు కేటాయించారు.
ఉన్నత విద్యకు గత బడ్జెట్లో 44,094.62 కోట్లు కేటాయిస్తే, ఈ బడ్జెట్లో 53,196.28.కోట్లు కేటాయించారు.
బిజెపి ప్రభుత్వం ఈ దేశంలో “సమూల మార్పులు తెచ్చే,భవిష్యత్ మార్చే విద్యావిధానం అని తీసుకుని వస్తున్న నూతన విద్యావిధానం – 2020” ఈ బడ్జెట్ తో అమలు చేస్తారా ? అని ఏఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ప్రశ్నిస్తుంది .
నూతన విద్యావిధానం -2020, దాని ప్రతిపాదనలు ఈ దేశంలో అమలు చేయాలంటే కనీసం 6% నిధులు (4,82,100) కోట్ల నిధులు అవసరం అని చెబితే ప్రభుత్వం ప్రస్తుతం ఒక లక్ష కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది.
దేశం విద్యారంగాన్ని అభివృద్ది చేయాలంటే జిడిపి లో 6 శాతం కేంద్ర బడ్జెట్ లో 10 శాతం నిధులు కేటాయించాలని అనేక సంవత్సరాలుగా విద్యావేత్తలు , మేధావులు, చెబుతున్న మోదీ ప్రభుత్వం క్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తుంది. ఈ బడ్జెట్ నిధులతో భారత దేశం, ఇతర దేశాలతో ఎలా పోటీపడుతుంది. ప్రతి యేటా భారత దేశం నుండి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వలసలు పోతున్న కనీసం ఆలోచన లేని మోదీ ప్రభుత్వం దేశ విద్యారంగాన్ని కార్పోరేట్ కోసం మాత్రమే పెడుతుందని ఏఐఎస్ఎఫ్ ఆరోపిస్తుంది.
రానున్న కాలంలో 1000 ఐటి ఐలను అభివృద్ది చేస్తామని, విద్యారుణాలను పెంచుతూ 10 లక్షల వరకు ఇస్తామని,20 లక్షల మంది నైపుణ్య శిక్షణా అందిస్తామని చెబుతూనే కార్పోరేట్ శక్తుల ఉత్పత్తికి గుమాస్తాల తయారీకి చర్యలు తీసుకుంటుందనే చెప్పిందని విమర్శించారు. బడ్జెట్ ను సవరించి, విద్యా అభివృద్ధికి ప్రభుత్వ రంగంలో ఉన్నత విద్య అభివృద్ధి కోసం చర్యలు తీసుకొని నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ కోరుతుంది.