★నేటి గదర్ లో పబ్లిష్ చేసిన కొన్ని గంటల లోనే కోడి పుంజుల వాగు పరిశీలన
★కాంట్రాక్టర్,సింగరేణి అధికారుల నిర్లక్ష్యం మే బ్రిడ్జి కుంగడాని కి కారణం
★కూనవరం ఎంపిటిసి గుడిపూడి కోటేశ్వరరావు
నేటి గద్దర్ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి, మణుగూరు జులై 24:రెండో సారి కోడి పుంజుల వాగు కుంగింది అనే శీర్షిక న బుధవారం ఉదయం ప్రచురించిన విషయం పాఠకులకు విధితమే.
నేటి గదర్ లో పబ్లిష్ చేసిన కొన్ని గంటల లోనే కోడి పుంజుల వాగును కునవరం MPTC గుడిపుడి కోటేశ్వరరావు పరిశీలన చేశారు. కోడి పుంజుల వాగు కుంగు బాటు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ , సింగరేణి అధికారుల నిర్లక్ష్య వైఖరిని దుయ్యబట్టారు
★★★★★★★★★★★★★★★★★★★★★★★★★
మణుగూరు మండలంలోని కూనవరం రైల్వే గేటు దగ్గర ఉన్న కోడి పుంజుల వాగు వంతెన వరదలు వలన కుంగిపోయిన విషయం తెలుసుకొని కూనవరం ఎంపిటిసి గుడిపూడి కోటేశ్వరరావు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,గత సంవత్సరం నిర్మాణం చేసిన వంతెన ఆ సంవత్సరమే వచ్చిన వరదలకు పైన ఉన్న సైడు వాల్,దిమ్మలు కొట్టుకొని పోయాయని,మరలా ఈ సంవత్సరం గత కొద్ది రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు అడుగు భాగంలో ఇసుక కొట్టుకుపోవడం వలన క్రింద భాగం కుంగిపోయిందని,దీనికి కారణం కాంట్రాక్టర్,మరియు అధికారులుకు ముందస్తు ఆలోచన లేకపోవడమేనని, ఆయన మండిపడ్డారు.పనులు జరిగే సమయంలో సింగరేణి అధికారుల పర్యవేక్షణ లేక పోవడమే దీనికి ప్రధాన కారణమని ఆయన అన్నారు.అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా ఉందని ఆరోపించారు.