★పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి
నేటి గద్దర్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్, మేడ్చల్ జిల్లా బ్యూరో(జూలై 24);
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని నారపల్లి గణేష్ నగర్ కాలనీలో సాధారణ నిధులుతో అంచనా వ్యయం దాదాపు 10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక కౌన్సిలర్ అబ్బవతిని సరిత స్వామి తో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొండల్ రెడ్డి మాట్లాడుతూ.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో సీసీ రోడ్లు ,భూగర్భ డ్రైనేజీ పనులు, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. అలాగే స్థానిక కాలనీవాసులతో మాట్లాడుతూ.. ఎలాంటి సమస్యలు ఉన్న పాలకవర్గం దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పశ్య వేమన్ రెడ్డి,
కాలనీ వాసులు ,
పరమేశ్, బాలయ్య, శ్రీకాంత్, త్రినాథ్, సంజీవ రెడ్డి , యాదగిరి, సింహాద్రి, శ్రీనాథ్ , నరేందర్ రెడ్డి , మీసాల సురేష్, రామ రావు, అబ్బవతిని బాలరాజు, శ్రీనివాస్, శ్రీకాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ రంగ నాయకులు తదితరులుపాల్గొన్నారు.