తల్లాడ గదర్ న్యూస్ ప్రతినిధి. పెద్దబోయిన శ్రీనివాసరావు.
ఖమ్మం జిల్లా తల్లాడ పట్టణంలో బుధవారం బిజెపి ఖమ్మం జిల్లా పార్లమెంట్ నాయకులు వినోద్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిజెపి పార్టీ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యులు చల్లా నాగులు ఆధ్వర్యంలో బిజెపి నాయకురాలు ఎంపీటీసీ చల్లా తిరుమల దేవి సమక్షంలో కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ప్రజానీకానికి పంపిణీ చేశారు. అనంతరం ఎంపీటీసీ చల్లా తిరుమల దేవి మాట్లాడుతూ తాండ్ర వినోద రావు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ప్రజా సంక్షేమ కోసం పని చేసే వ్యక్తి ప్రజాసంక్షేమ దైవంగా రాజకీయాలకు అతీతంగా పనిచేసే వ్యక్తి అని కొనియాడారు. మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు అన్ని వర్గాలకు ఎంతో ఉపయోగంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చల్లా నాగులు, ఎంపీటీసీ తిరుమల దేవి, బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆపతి వెంకట రామారావు, జిల్లా కిషన్ మోర్చా నాయకులు బాలాజీ నాయక్, ప్రధాన కార్యదర్శి సభ్యులు గాదే కృష్ణారావు, రాయల రమేష్,మండల నాయకులు సంగీతం సాయిచంద్, తమ్మిశెట్టి కృష్ణ, కిషన్ మోర్చా మండల అధ్యక్షులు చౌడ నాగేశ్వరరావు, చల్లా నరసింహారావు, మహేశ్వర్ రెడ్డి, యువమోర్చా ఎల్లంకి సుధాకర్, మండల యువజన నాయకులు చల్లా రాము, సాయి, స్టాలిన్,నరసింహారావు పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు