◆రాయల చంద్రశేఖర్ ఆశయ సాధనకై పోరాడుదాం
◆జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూపా భాస్కర్
నేటి గదర్ న్యూస్, ములకలపల్లి:
ములకలపల్లి మండలం ముకమమిడి గ్రామంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాయల చంద్రశేఖర్ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంతాప సభ పార్టీ మండల కమిటీ సభ్యులు శాస్త్ర బోయిన వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సంతాప సభకు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నూప భాస్కర్ పాల్గొని ముందుగా కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి పూలతో నివాళులర్పించి అనంతరం సంతాప సభను ఉద్దేశించి మాట్లాడుతూ.కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ మరణం విప్లవోద్యమానికి తీరని లోటు అని,రాయాలా చంద్రశేఖర్ ఆశయ సాధన కోసం పోరాడుదాం అని పిలుపునిచ్చారు.కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఖమ్మం జిల్లా,తిరుమలాయపాలెం మండలం,పిండిప్రోలు గ్రామంలో జన్మించారని,ఖమ్మంలో డిగ్రీ విద్యను అభ్యసిస్తూ,ఉన్నత విద్యను వదిలి సమాజంలోని పేద,ధనిక అంతరాలను చూసి,దోపిడీ, పీడనలను చూసి ధనిక,పేద అంతరాలు లేని,దోపిడీ,పీడనలు లేని సమ సమాజ స్థాపన కోసం కలలుగని,అందుకోసం జీవితాంతం విప్లవోద్యమానికి అంకితమై పని చేశారన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మణుగూరు,అశ్వాపురం ఏరియాలో, సత్తుపల్లి, అశ్వరావుపేట,వేలూరుపాడు ఏరియాలో పని చేశారు అని.ఇల్లెందు ఏజెన్సీలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించి,ఎన్నో నిర్బంధాలను,కష్టాలను అనుభవించాడన్నారు.ఉద్యమ ప్రస్థానంలో ఎదురైన ఎన్నో నిర్బంధాలను,కష్టాలను అధిగమించి అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడన్నారు.సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా,కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ గా,అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా,సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ సభ్యులుగా,సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ,ప్రజాపంథా రాజకీయాల అభివృద్ధి కోసం,రైతాంగ ఉద్యమ అభివృద్ధి కోసం తన తుది శ్వాస వరకు పనిచేశారన్నారు.కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న అకాల మరణం చెందడం బాధాకరం మని అన్నారు. కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న మరణం విప్లవోద్యమానికి తీరనిలోటని,రాయల చంద్రశేఖర్ అన్న ఆశయ సాధన కోసం పోరాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజా పంథా పార్టీ ములకలపల్లి,అన్నపురెడ్డిపల్లి సంయుక్త మండలాల కార్యదర్శి కొర్సా రామకృష్ణ కమిటీ కార్యదర్శులు ఏం బిక్షం,డి దాసు,టీ జానుబాబు,పి ముత్యాలు ఆర్ నాగేష్,ఆర్ శ్రీకాంత్,జి బిక్షం,జి ఐలయ్య,జి కిసాన్ కే వెంకటేష్,వినోద్,గణేష్,బుచ్చయ్య,మహేష్,నగేష్,నాగరాజు,దేవల,కొండలరావు మరియు సురేష్ తదితరులు పాల్గొన్నారు.