సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్)
*జిల్లాలో రుణమాఫీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది**
*సాంకేతిక కారణాలతో రైతు రుణమాఫీ రైతుల సమస్యను పరిష్కరించి అర్హులకు రుణమాఫీ చేసేందుకు విశేష కృషి చేయాలి*
*జిల్లాలో 47616 రుణమాఫీ లబ్ధిదారులకు 237.50 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ**
*జిల్లాలో రుణమాఫీ అమలు తీరుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం*
*జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్*
బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో రైతు రుణ మాఫీపై జిల్లా వ్యవసాయ, లీడ్ బ్యాంకు మేనేజర్ జిల్లా కో-ఆపరేటివ్ అధికారులతో కలిసి కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 47,616, మంది రైతులకు లక్ష లోపు రుణమాఫీ లో భాగంగా 237.50 కోట్లు రుణం మాఫీ జరిగిందని చెప్పారు.
రుణమాఫీ అమౌంట్ జమ గాని ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ తో సంప్రదించి సమస్యను పరిష్కరించవలసిందిగా
జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
క్షేత్రస్థాయిలో రుణమాఫీలో సమస్యలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకొని ఈ పథకం పగడ్బందీగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు
రైతు రుణమాఫీ బృహత్తర కార్యక్రమం అని రైతుల శ్రేయస్సు కోరి రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తుందని ఈ దిశగా ముందుకు పోవాలన్నారు తద్వారా వ్యవసాయ రంగ అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు .
వ్యవసాయ భూమి ఉండి రుణం తీసుకున్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు.
ఇందులో ఎవరికైనా రుణమాఫీ జరగకపోతే మండల లేదా జిల్లా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలో మిగిలిన రైతులకు రుణమాఫీలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యను పరిష్కరించి త్వరలోనే రుణమాఫీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం సూచించిన విధంగా అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ జరుగుతుందని అపోహ చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశం లో
జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, లీడ్ బ్యాంకు మేనేజర్ నరసింహమూర్తి జిల్లా కోపరేటివ్ అధికారి కరుణ తదితరులు పాల్గొన్నారు.