+91 95819 05907

కావాలని బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు బడ్జెట్ పై రాద్ధాంతం చేస్తున్నాయి :మహేందర్ నాయక్

★తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది, కావాలని బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు బడ్జెట్ పై రాద్ధాంతం చేస్తున్నాయి

◆భాజపా నాయకులు మహేందర్ నాయక్

నేటి గదర్ న్యూస్,పాలేరు ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ అభివృద్ధి ధ్యేయంగా పన్నుల వాటాలో పెంపును స్వాగతిస్తూ..
నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరో మారు పేదల ప్రభుత్వము అనే నిరూపించుకుంది అని భాజపా నాయకులు మహేందర్ నాయక్ అన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి 26 వేల 216 కోట్లు రాష్ట్రానికి రానున్నాయి గత ఏడాది రాష్ట్రానికి పన్నుల వాటా కింద 23,216 కోట్లు రాగా ఈసారి ₹3,000 కోట్ల రూపాయలు అదనంగా ఇస్తున్నందుకు మోడీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
దీంతోపాటు 15వ ఆర్థిక సంఘం నిధులు 2273 కోట్ల ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్నాయి. ఇవే నిధుల్లో గ్రామీణ స్థానిక సంస్థలకు 147 కోట్లు అదనంగా ఇవ్వడాని మోడీ సహకారాన్ని స్వాగతిస్తూ పట్టణ స్థానిక సంస్థలకు 796 కోట్లు వస్తున్నాయి. దేశంలో మరో ఏడాదికి స్మార్ట్ సిటీల ప్రాజెక్టును కొనసాగించడానికి కేంద్రం అంగీకరించడానికి స్వాగతిస్తూ 2236 కోట్లు కేటాయించిది . దీంతో రాష్ట్రానికి స్మార్ట్ సిటీలైన వరంగల్ కరీంనగర్ల స్మార్ట్ సిటీల ప్రాజెక్టులను కొనసాగించడానికి కేంద్రం ఈ రెండు నగరాల్లో పెండింగ్ పనులు పూర్తవడానికి మార్గం సుగమం చేసింది.
అమృత్ పథకానికి నిధుల పెంపు స్వాగతిస్తూ మోడీ కి ధన్యవాదాలు తెలియజేశారు.
పట్టణాల అభివృద్ధికి ఉద్దేశించిన అమృత్ పథకానికి ఈ ఏడాది నిధులు కేటాయింపును కేంద్రం పెంచింది. గత ఏడాది 422 కోట్లు కేటాయించగా ఏడాది 631 కోట్లు కేటాయించింది రాష్ట్రంలోని అమృత్ పట్టణాల్లో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడానికి నరేంద్ర మోడీ సహకరించడానికి పేదలకు ఇళ్ల నిర్మాణానికి ప్రధానంగా పేదల గురించి ఆలోచించే ప్రభుత్వమని మరో మారు నిరూపించుకుంటూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు కేటాంపిన హర్షిస్తున్నాం. ఈ ఏడాది 23,613 కోట్లు కేంద్రం కేటాయించగా రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణానికి పేదలందరికీ నివాసయోగ్యమైన ఆవాస యోజన ద్వారా ఇండ్లు వస్తాయని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ముమ్మాటికి పేదల ప్రభుత్వమని మరోమారు నిరూపమైంది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కు ఈ సంవత్సరం 18 84 కోట్లు నిధులు రాష్ట్రానికి రానున్నాయి .దీంతో మారుమూల గ్రామాల్లో రోడ్ల వసతి మెరుగయ్యే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఐఐటీలకు ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఐఐటీలకు గ్రేడియేషన్ 645 కోట్లు కేటాయించింది .రాష్ట్రంలో ఐఐటి ఆర్గనైజేషన్ అవకాశం కలగనుంది టీం బెస్ట్ టూరిస్ట్ సర్క్యూట్ లకు కేంద్రం బడ్జెట్లో 1715 కోట్లు కేటాయించింది రాష్ట్రంలో భీం బెస్ట్ టూరిస్ట్ సర్క్యూట్లు ద్వారా పర్యాటక అభివృద్ధికి అభివృద్ధి జరగనుంది. ఏకలవ్య పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు రాష్ట్రానికి పంపనుంది 1815 కోట్లు పోయిన సంవత్సరం కేటాయించగా ,ఈ సంవత్సరం 46 80 కోట్లు పెంచుతూ రాష్ట్రానికి ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో 23 ఏకలవ్య గురుకుల పాఠశాలలు ఉండగా నిధుల కేటాయింపు పెరిగిన నేపథ్యంలో శాశ్వత భవనాల నిర్మాణం భవనాలు నిర్మాణం చేపట్టడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకరిస్తుంది అంతేకాకుండా
పట్టణ ప్రాంతాల్లో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులతో పాటు టీబీ కుష్టు వ్యాధుల నివారణ కార్యక్రమాల్లో రాష్ట్రాలకు అండగా నిలిచేందుకు కేంద్రం నిధులు నిధులను 38 కోట్ల నుండి 141 కోట్లకు పెంచింది ముమ్మాటికి పేదల ప్రభుత్వమని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి నిరూపణ చేసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మోడీ అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !