సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్ జిల్లా)
శనివారం నర్సాపూర్ నియోజకవర్గం జక్కపల్లిలో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలసి పర్యటించారు .
ఈ సందర్భంగా సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించిన మేరకు స్థల పరిశీలనలో భాగంగా రావడం జరిగిందని చెప్పారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో జక్కపల్లి వద్ద ప్రభుత్వ భూమిని ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డితో కలిసి తో కలిసి స్థల పరిశీలన చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఈ ప్రభుత్వ భూమికి సంబంధించి ప్రతిపాదన సిద్ధం చేసి అందించాలని అన్నారు. బీసీ ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని సంక్షేమ శాఖలు విద్యార్థులకు ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టినట్లయితే భేద భావన అభిప్రాయం పోతుందని సౌకర్యాలు కల్పన కూడా సులభతరం అవుతాయని ప్రభుత్వ సూచనల మేరకు స్థల పరిశీలన చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి తాసిల్దార్ సంబంధిత రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.