సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్ జిల్లా)
*మెదక్ జిల్లా నర్సాపూర్
అర్ డి ఓ ఆఫీస్ లో
రైతులు అడిగిన పలు సందేహాలకు సమాధానం ఇచ్చిన కలెక్టర్*
*భూసేకరణ కోసం రైతులు సహకరించాలని కోరారు.*
రీజనల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రత్నాపూర్ మరియు చిన్న చింతకుంట గ్రామస్తులతో ఆర్డిఓ కార్యాలయంలో సమావేశం.
ఆర్ఆర్ భూముల పరిహారం విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు.
బుధవారం నర్సాపూర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో సంబంధిత ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డితో కలిసి రీజినల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రత్నాపూర్ మరియు చిన్నచింతకుంట గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీజినల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రత్నాపూర్ మరియు చిన్నచింతకుంట గ్రామస్తులు పరిహారం విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అలైన్మెంట్ మార్పు విషయంలొ రైతులు అడగగ అలైన్మెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మారదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు.
న్యాయమైన పరిహారం కోసం ఇప్పుడున్న మార్కెట్ రేట్ సవరించడం కోసం జిల్లా కమిటీని వేశామని దాని ద్వారా ఇప్పుడున్న మార్కెట్ రేటు సవరించడం జరుగుతుందని, దీనివల్ల రైతులకు సరైన పరిహారం లభిస్తుందని తెలిపారు భూమికి భూమి ఇవ్వాలని కోరగా చట్టంలో అటువంటి విధానం ఏదీ లేదని కాబట్టి అది సాధ్యపడదని మెరుగైన పరిహారం కోసం కృషి చేస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో ఆర్డీఓ, నర్సాపూర్, జగదీశ్వర్ రెడ్డి శివంపేట తాహసిల్దారులు పాల్గొన్నారు.