*మురికి కాలువలు పరిశుభ్రంగా ఉంచాలి, నీరు నిల్వ ఉండకుండా చూడాలి*
*పిచ్చి మొక్కలు తొలగించాలి, పాడుబడిన బావులను కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలి*
సిల్వర్ రాజేష్ (నేటి గదర్ న్యూస్ ప్రతనిధి మెదక్ జిల్లా).
★ప్రజా పాలన,ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
★ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటించాలి
★కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలో నిర్వహించిన ఫ్రైడే -డ్రై డే కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
కౌడిపల్లి మండలంలోని దేవులపల్లి గ్రామంలో శుక్రవారం ఫ్రైడే -డ్రైడే కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో పరిశుభ్రత కార్యక్రమాలపై వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా
మాట్లాడుతూఈ ప్రతీ శుక్రవారం డ్రై డే ను పాటించాలని , గుంతల లో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి అని ఆయన అన్నారు.
నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్, క్రూడ్ ఆయిల్ ను చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చని ఆయన చెప్పారు.
దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మలేరియా,
చికెన్ గున్యా తదితర వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇండ్లల్లో నీటి నిలువలు లేకుండా, పరిశుభ్రంగా ఉంచుకోవలాన్నారు.
ఇంటి పరిసరాలలో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు,పగిలిన సీసాలు, ప్లాస్టిక్ కవర్లు, వాడిన టీ కప్పులు,ఇతర నీటి నిలువలు గల చిన్నపాత్రలను ఎప్పటికప్పుడు
తొలగించాలన్నారు.
వారానికి ఒక సారి నీటి పాత్రలను శుభ్రపరచి నీటిని నింపుకోవాలనీ, ఇండ్ల లో వాడే కూలర్స్, ఫ్రీజ్, ఏ.సీ లలో నీరు నిల్వ లేకుండా ఎపటికప్పుడు శుభ్రపరచుకొని జాగ్రత్త పడాలన్నారు.
జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పాడుబడిన బావులను, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లను తొలగించాలని, మలేరియా, డెంగీ ,టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు పొంచి ఉండే ప్రమాదం ఉన్నందున అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరీక్షలు జరిపించాలని అన్నారు.
వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించాలని కాచి చల్లార్చిన నీటి మాత్రమే తాగాలని తెలిపారు. ప్రజల్లో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు.
అల్పాహారం వేడి చేసిన భోజనం తీసుకోవాలన్నారు. నిలువచేసిన పదార్థాలు బయట తినుబండాలకు దూరంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు.
అనంతరం మండలతహసిల్దార్ కార్యాలయంలో ప్రజాపాలన, ధరణి పెండింగ్ ఫైళ్లను పరిశీలించారు. సత్వరమే మండల స్థాయిలో ఉన్న ప్రజా పాలన దరఖాస్తులను, ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ,అధికారులు,
సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.