రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 27:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని మూడో వార్డులో వర్ష బావ పరిస్థితుల వలన మురికి కాలువలలో నీరు నిల్వ ఉండటం వల్ల ప్రక్కన ఉన్నటువంటి కుటుంబాలకు ఇబ్బంది అవుతున్న విషయాన్ని కాలనీవాసులు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ శనివారం రోజు ఉదయం మూడవ వార్డును సందర్శించి పరిశీలించారు.ప్రస్తుతం వర్షం పడుతున్న కారణంగా జెసిబి ద్వారా మెయిన్ రోడ్డుకు పోయే పెద్ద మురికి కాలువలో మురికి నీరు పోవడానికి జెసిబి ద్వారా మట్టి కాలువ తీయడానికి పని మొదలు పెట్టాలని వర్క్ ఇన్స్పెక్టర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో పుట్టి యాదగిరి, సొసైటీ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ ఏఈ సాయిరాం రెడ్డి, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 75