రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూలై 27:- అంతర్జాతీయంగా లయన్స్ క్లబ్బులు అన్ని రంగాలలో అవసరం ఉన్నవారికి ఆర్తులకు సేవలు అందిస్తున్నాయని ముఖ్యంగా ఆపదలో మరియు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లలో అవసరం ఉన్నవారికి రక్తదానం ద్వారా అలాగే అనివార్య కారణాలవల్ల అవయవాలు దెబ్బతిని మరణానికి దగ్గరగా ఉన్నవారికి అవయవ దానం వల్ల మరో జన్మను ప్రసాదించవచ్చని మారు మూల గ్రామాలలో సైతం కరపత్రంల ద్వారా గోడపత్రికల వార్త, సామాజిక మాధ్యమమూల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తూ రక్త అవయవ దానాలకు కృషి చేస్తుందని లయన్స్ అంతర్జాతీయ అధ్యక్షులు లయన్ ఫెబ్రిషియో ఓలివైర అన్నారు.”ద ఇంజినీర్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ హైదరాబాదు”లో జరిగిన తెలంగాణలోని ఎనిమిది లయన్స్ జిల్లాలలోని క్యాట్ 3.0 లయన్స్ నాయకుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని లయన్స్ క్లబ్ రామాయంపేట చార్టర్ సభ్యుడిగా లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి గత రెండున్నర దశాబ్దాలుగా రక్త అవయవ దానాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు.రక్త నేత్ర అవయవ దానాలకు తన కరపత్రంల ద్వారా గోడపత్రికల ద్వారా కళాశాల విద్యార్థుల నుండి ప్రజలను సహా పరుస్తున్న విధానాలను అభినందించి తను రూపొందించిన గోడ పత్రికను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ డాక్టర్ ఘట్టమనేని బాబురావు రాజశేఖర్ రెడ్డిని అంతర్జాతీయ అధ్యక్షుడికి పరిచయం చేస్తూ గోడ పత్రిక విడుదలకు సహకారాన్ని అందించారని అన్నారు.గతంలో కంటే ప్రస్తుత పరిస్థితుల్లో రక్త అవయవ దానాల ప్రాముఖ్యత, ఆవశ్యకత చాలా పెరిగిందని ప్రజలలో కూడా అవగాహన ఏర్పడిందని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా రక్త అవయవ దానాలకు ప్రజలు ముందుకు వస్తున్నారని లయన్ బాబురావు అన్నారు. లయన్స్ ఏరియా కాన్స్టిట్యూషనల్ లీడర్ లయన్ రుమాళ్ళ సునీల్ కుమార్ మాట్లాడుతూ 34 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ రామాయంపేట సభ్యులు,మరియు రాజశేఖర్ రెడ్డి గ్రామీణ ప్రాంతాలలో వైద్య శిబిరాల ద్వారా విపత్కర పరిస్థితుల్లో సేవా కార్యక్రమాల ద్వారా ఆర్తులకు అన్ని రంగాలలో సేవలందిస్తున్నాయని, సేవలను ఇంకా విస్తృత పరిచి ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన లయన్స్ నాయకులు కార్యక్రమంలో పాల్గొని సమస్త బలోపేతం చేయడానికి సభ్యుల చేరిక చాలా అవసరమని మిషన్ 1.5 లో ప్రతి ఒక్కరు భాగస్వాములై నూతన సభ్యుల చేరికకు కృషి చేయాలని లయన్స్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్ పర్సన్ హనుమాన్ల రాజిరెడ్డి ,పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్ పర్సన్ లయన్ తీగల మోహన్రావు కోరారు.నేడు సమాజంలో జరుగుతున్న యాక్సిడెంట్లు వల్ల, ఆనారోగ్యపరంగా అవసరం ఉన్నవారికి రక్తము అందుబాటులో లేక ఎందరో మరణిస్తున్నారని, అలాగే అవయవాలను,దానం చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడం వల్ల కొన్ని అవయవాలు అవసరమైన వారికి మరణం సంభవిస్తుందని ఈ విషయంలో లయన్స్ క్లబ్బులు అంతర్జాతీయంగా రక్త అవయవాదానాల పై అవగాహన కల్పించి, సేకరణకు ముందుంటున్నాయని లయన్స్ 320-డి గవర్నర్ లయన్ నగేష్ పంపాటి వెల్లడించారు.ఈ లయన్స్ సంవత్సరం జిల్లా 320-డి లోని లయన్స్ సభ్యులు “ఎంపవర్” నినాదంతో కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు.లయన్ ఏ.అమర్నాథ్ రావు మొదటి వైస్ గవర్నర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లా కార్యక్రమాల్లో ఆర్గాన్ డొనేషన్ కి ప్రాముఖ్యతను ఇవ్వబడిందని, గత 34 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్, రామాయంపేటలో అన్ని విషయాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ముఖ్యంగా రక్త, అవయవదానాల అవగాహనకు స్కూల్,కళాశాల విద్యార్థులకు, మారుమూల గ్రామస్తులకు, అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తు, లయన్స్ జిల్లా 320-డి లోని నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్ ,సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలలో సామాజిక మాధ్యమాలలో మరియు పత్రికలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి నేత్రదానానికి, అవయవ దానానికి, శరీరధానానికి, కృషి చేయవలసిందిగా కోరారు. లయన్ ఎం. విజయలక్ష్మి రెండవ వైస్ గవర్నర్ మాట్లాడుతూ రక్త అవయవదానాల ప్రాముఖ్యతను మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్లాలని తెలిపారు.ఈ పోస్టర్ ఆవిష్కరణకు కృషిచేసిన డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డిని అభినందించిన్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ లయన్ అసపల్లి శ్రీధర్,క్యాబినెట్ ట్రెసరర్ వెంపటి మధు, జిల్లా గాట్ నాయకులు లయన్స్ ఎం.నాగరాజు, నరసింహారాజు, మర్రి ప్రవీణ్, సూర్యనారాయణ,టి విజయలక్ష్మి మర్రి ప్రమోద్, వివిధ లయన్స్ జిల్లాలకు చెందిన కెబినెట్ నాయకులు, లయన్స్ ఈ.వి. రమణ, ఆర్ నారాయణ, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ,కోటిరెడ్డి, విజయరంగా,పి.శ్రీధర్, పీ.కే. జైన్, పి.వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు.