◆కార్మికవర్గాన్ని కనీస వేతనం చట్టం అమలు చెయ్యాలి .
◆ మోడీ – సర్కార్ బడ్జట్ లో కార్మికులకు మొండి చెయ్యి చూపారు
◆ప్రభుత్వరంగ సంస్థలను బిజెపి కుట్రల నుండి కాపాడుకుందాం.
◆8 గంటల పని హక్కు సాధించింది ఏఐటీయూసీనే
◆ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఎస్కే సాబీర్ పాషా
◆ఘనంగా ఏఐటీయూసీ జూలూరుపాడ్ మండలం మహాసభ .
నేటి గదర్ న్యూస్ ,జూలూరుపాడ్ :
కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం సంఘటిత అసంఘటిత కార్మిక లోకం పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్కే సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సోమవారం జరిగిన ఏఐటీయూసీ 6వ మహాసభ నిర్వహించారు.
మహాసభ లో మాట్లాడుతూ ఇటీవల పెట్టిన బడ్జట్ లో దేశం లో మోడీ – ప్రభుత్వాలు కార్మిక వర్గానికి ఎలాంటి ప్రయోజనకరం గా ఒక్కరూపాయి కూడా నిధులు ఇవ్వలేదు అని మనిషి జీవిచాలి అంటే కనీస వేతనం 26 వేలు ప్రతి నెల ఇవ్వాలి అన్న సుప్రీ కోర్టు ఆదేశం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనే చట్టం అమలు ఎందుకు పాలకులు చేయరు అని ప్రశ్నించారు ,
కొట్లాడి సాధించిన 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోల్డ్ గా మార్చాలని కుట్రను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తుంది అని, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి ఆదా నీ అంబానీలకు అప్పజెప్పేందుకు తీవ్ర కృషి చేస్తుందని విమర్శించారు.
కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం లు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కార్మికులు కు నిదులు కేటాంపులు జరుపలేదు అని, సంఘటిత,రంగం లో రాష్టం లో 2 కోట్ల మంది కార్మికులు కు ఎలాంటి ప్రయోజనము లేకుండా చేసారు అని కనీస వేతనం అందటం లేదు అని ఆవేదన ఎక్తం చేశారు.అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక జీవులకు ఏఐటీయూసీ దిక్చూచి వంటిదని, కార్మికులకు ఏ కష్టం వచ్చినా బాసటగా నిలిచే సంఘం ఏఐటీయూసీ అని, కార్మికులు, ఉద్యోగుల హక్కులు, సౌకర్యాలకు స్వాతంత్రానికి పూర్వం నుంచే పోరాడుతోందని, 8 గంటల పనివిధానం, సంక్షేమ చట్టాలను సాధించి పెటింది ఏఐటీయూసీనేనని అన్నారు. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న చట్టాలని ప్రస్తుత మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుంట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితిలో ఏఐటీయూసీ నాయకత్వంలో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శి కంచర్ల జమలయ్య నరాటి ప్రసాద్ మాట్లాడుతూ కార్మిక వర్గానికి అనేక హామీలు గుప్పించిన అధికారంలోకి వచ్చినా కేంద్రంలోని బిజెపి సర్కార్ అధికారం చేపట్టిన తరవాత అనేక పోరాటాలుతో సాధించిన కార్మిక చట్టాలను సవరించి యాజమాన్యాలకు, కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ కుట్రలను కార్మిక వర్గం ఉద్యమాలతోనే తిప్పికొట్టి సంక్షేమ చట్టాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నేటి పాలకులు కనీస వేతన చట్టం, పారిశ్రామిక చట్టాలను సవరణ చేయడంతోపాటు సంస్కరణలు పేరుతో ఉద్యోగులను, కార్మికులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారని, ప్రభుత్వాల దుశ్చర్యలను కార్మికువర్గ పోరాటంతో ఎదిరించి హక్కులను కాపాడుకోవాలని అన్నారు, ఈ మహా సభ లో సిపిఐ వైరా డివిజన్ కన్వీనర్, ఎర్రబాబు తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చంద్ర నరేంద్ర కుమార్ సిపిఐ మండల కార్యదర్శి గుండే పిన్ని వెంకటేశ్వర్లు, అంగన్వాడి వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గోనె మణి aiyf జిల్లా కార్యదర్శి, sk నాగుల్ మీరా,సెకండ్ ఏఎన్ఎమ్స్ జిల్లా అధ్యక్షురాలు బానోత్ పార్వతి, అంగన్వాడీ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, భూక్య లలిత ఏఐటీయూసీ నాయకులు గార్లపాటి వీరభద్రము, వ ల్ల మల్ల సామేలు మల్కమ్ వీరభద్ర ము ముదిగొండ లక్ష్మి పత్తిపాటి యోహాన్, ఊడల శ్రీను, కొట్టి శ్రీను, బలుగూరి నరసింహారావు, sk కరిముల్లా, కత్తి గోపి, భూక్య లలిత తదితరులు పాల్గొన్నారు