నేటి గదర్, జూలై 29,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో,
అలవాల వంశీ, 9052354516 :
భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని వరద బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత అన్నారు. సోమవారం భద్రాచలం పట్టణంలోని నన్నపనేని జడ్పీ హైస్కూల్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోని వరద బాధితులను మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… ప్రభుత్వం పేదల పట్ల ఎప్పుడు వివక్షత చూపుతోందని, గత ప్రభుత్వం ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వకపోవడం వలన వరద ముంపు ప్రాంతాల ప్రజలు వరదల సమయంలో అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే డబల్ బెడ్రూం ఇల్లు ఇచ్చి వరద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా వరద బాధితులను బలవంతంగా ఖాళీ చేయించి అరకొర వసతులతో వసతులు కల్పిస్తున్నామని మభ్యపెడుతూ మాయ చేస్తూ బాధిత కుటుంబాలను ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. గత కలెక్టర్ ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ తక్షణ ఇవ్వకుంటే బాధితుల తరఫున ఎంతటి పోరాటానికైనా మహాజన మహిళా సమైక్య సిద్ధమని తెలియజేశారు. వరదల వల్ల నష్టపోతున్న కుటుంబాలకు లక్ష పరిహారం వచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహాజన మహిళా సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు కొచ్చర్ల కుమారి, కొప్పుల నాగమణి, బొడ్డు రమాదేవి, సాల్మ తదితరులు పాల్గొన్నారు.