◆శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విజుబుల్ పోలిసింగ్ కీలకం, విజుబుల్ పొలిసింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించాలి.
◆సిబ్బంది తరచు గ్రామాలలో పర్యటిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించాలి
◆ప్రజలకు అన్ని విధాల రక్షణ, భద్రత కల్పించాలి
జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
సిల్వర్ రాజేష్ (నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మెదక్)
ఈ రోజు (సోమవారం)జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.మెదక్ రూరల్ సరికిల్ పరిదిలోని మెదక్ రూరల్ హవేలి ఘనపూర్ మరియు కొల్చారమ్ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అక్కడి పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను సంబందిత ఎస్.ఐ లు ఎస్పీ గారికి వివరించారు. ఈ తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ అధికారులకు పలు సూచనలు చేస్తూ.. నేరాలను నియంత్రించడంతో పాటు, శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే విజుబుల్ పోలీసింగ్ తోనే సాధ్యపడుతుందని శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విజుబుల్ పోలిసింగ్ కీలకం అని, విజుబుల్ పోలీసింగ్ లో భాగంగా విలేజ్ పోలీస్ అధికారులు, పెట్రో కార్, బ్లూ కోర్ట్ సిబ్బంది తరచు గ్రామాలను పర్యటిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించాలన్నారు. అనంతరం జిల్లా ఎస్.పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిదప పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిసి కెమెరాలు, సిబ్బంది పని తీరును పరిశీలించడంతో పాటు పెండింగ్లో తీవ్రమైన నేరాల సి.డి ఫైల్స్, స్థిరాస్థి చోరీలు, ఐటీ కేసుల ప్రస్తుత స్థితిగతులపై రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదిదారులతో మర్యాదపుర్యకంగా వుంటూ వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రజల మద్యే ఉంటూ పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న పోలీసుల పాత్రే కీలకంగా ఉంటుందని తెలిపారు, కాబట్టి సిబ్బంది పోలీసు స్టేషన్ లోని ప్రతి గ్రామం గురించి అవగాహాన కల్గివుండాలని, ప్రజలతో మమేకమై, ప్రజలకు మరింత చేరువ అవడానికి కమ్యూనిటీ పోలిసింగ్ మరియు ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానన్ని అమలు పరచాలని, అదేవిదంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని పోలీసులకు సూచించారు, నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞాణoను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు, కేసుల దర్యాప్తులలో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పద్ధతులను పాటించాలని అన్నారు. పోలిస్ స్టేషన్ పరిధిలో గస్తీ వాహనాలను నిరంతరం గస్తీలో తిప్పాలని, బీట్లు మరియు పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. స్టేషన్ రికార్డులను, పరిసరాలను, శుబ్రంగా ఉంచాలని తెలిపారు, జిల్లాలో పటిష్టమైన పోలీసు వ్యవస్థ ఉంటుందని, ప్రజలకు అన్ని విధాల రక్షణ, భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సిఐ.రాజశేఖర్ రెడ్డి,సంబందిత పోలీస్ స్టేషన్ ల ఎస్.ఐ.లు, సింబ్బంది పాల్గొన్నారు.