సిల్వర్ రాజేష్ ,నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మెదక్
మెదక్ నియోజకవర్గనికి చెందిన వివిధ గ్రామాల లబ్ధిదారులకు పలు అనారోగ్య సమస్యలతో కార్పోరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేసుకున్న లబ్ధిదారులకు సోమవారం నాడు తన క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి సిఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయం అందించారు.మెదక్ నియోజక వర్గ పరిధిలోని పలు మండలాలకు చెందిన 126 మంది లబ్ధిదారులకు సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ పేద,మధ్య తరగతి ప్రజలు అనారోగ్యానికి గురయి ఉన్నత వైద్యం పొందిన వెంటనే సిఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆసుపత్రి ఖర్చులను అందించడంజరిగిందని.
భవిష్యత్ లో సైతం మరింత మందికి సిఎం రిలీఫ్ ఫండ్ నుండి మరింత సహాయం చేస్తామని ఎమ్మెల్సీ తెలిపారు.ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో హవేలి ఘనపూర్ మాజీ ఎంపీపీ శేరి నారాయణ రెడ్డి,మాజీ సర్పంచులు మహిపాల్ రెడ్డి,శ్రీను నాయక్, యామి రెడ్డి,సాయగౌడ్,పుల్సింగ్,రమేష్,మాజీ ఎంపీటీసీలు మంగ్య నాయక్, భారాస మండల పార్టీ యువ నాయకులు ప్రశాంత్,సంతోష్ గౌడ్,రంజిత్ నాయక్,తరుణ్ నాయక్,సుభాష్ నాయక్,గణేష్,బాలేష్ తదితరులు ఉన్నారు.