◆కమీషనర్, చైర్మన్ కు నెల నెల వేతనం.
◆పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలల అయిన వేతనాలు అందవు.
నేటి గదర్ న్యూస్ జులై 29: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.
వైరా.మున్సిపాలిటీ లో పారిశుద్ధ్యం పడక వేసి ప్రధాన రహదారులు పై మురుగు నీరు ప్రవహించిన అధికారులు స్పందించడం లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు అన్నారు.
సోమవారం వైరా సిపిఎం కార్యాలయం లో జరిగిన సుందరయ్య నగర్ శాఖ సభ్యులు సమావేశం లో రాంబాబు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు ఆరు నెలల అయిన వేతనాలు రాక ఉత్సాహం గా పనిచేయడం లేదు, పారిశుద్ధ్య కార్మికులకు చేల్లించే ఏడు, ఎనిమిది వేల రూపాయలు కూడా నెలనెలా ఇవ్వకపోతే కార్మికులు కుటుంబాల జీవన పరిస్థితి, దయనీయంగా ఉన్నాయన్నారు.
మున్సిపాలిటీ లో పారిశుద్ధ్య కార్మికులు ఎందరు ఆ పని లో ఉండే సంఖ్య ఎంత కూడా స్పష్టత లేదని అన్నారు. వైరా లో ముఖ్య ప్రభుత్వ కార్యాలయాల ఎదురు గా ఖమ్మం రాజమండ్రి జాతీయ రహదారి పై మురుగు నీరు ప్రవహించిన అధికారులు స్పందించడం లేదని అన్నారు అదే రహదారిపై రాష్ట్ర మంత్రులు ప్రయాణం చేస్తున్నారు అని అన్నారు.
ఖాలీ స్థలాల్లో చెట్లు తొలిగించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, డ్రైనేజీ కాలువల్లో ప్లాస్టిక్ కవర్లు, చెత్త అడ్డుపడి వర్షం నీరు ఇండ్లలో కి వస్తుంది అని అన్నారు, పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన చేతి గ్లౌసులు, బూట్లు, డ్రస్,ఇతర మేటిరల్ అందించి పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేసి పారిశుద్ధ్యం పై కమీషనర్ చైర్మన్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు ఈ సమావేశంలో సిపిఎం వైరా పట్టణ కార్యదర్శి బొంతు సమత, శాఖ కార్యదర్శులు మందడపు రామారావు, గుడిమెట్ల మోహన్ రావు,తోట కృష్ణవేణి, కురుగుంట్ల శ్రీనివాసరావు,మల్లెంపాటి ప్రసాద్, రుద్రాక్షల నరిసింహాచారి, వడ్లమూడి మధు, కంసాని మల్లికంబా,వేదగిరి కళావతి,మాదినేని రజినీ, పారుపల్లి చంద్రశేఖర్ , సందీప్ ,నరిసింహరావుతదితరులు పాల్గొన్నారు