+91 95819 05907

రెప్పపాటులో ప్రాణాలు మింగే రాహు అడ్డ….సీఎం సార్ జర పట్టించుకోండి సార్

★ప్రాణాలు పోతున్న పట్టించుకోరా?

★అండర్ పాస్ బ్రిడ్జి పై పాలకుల నిర్లక్ష్య వైఖరి

★ఘట్కేసర్ అన్నోజిగూడలో అండర్ పాస్ బ్రిడ్జ్ లేక ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలే

★యమపురికి దారి ఎన్టీపీసీ రోడ్డు దారి

★ప్రమాదాలకు అడ్డా అన్నోజిగూడ రాహు” గడ్డ

★రోడ్డు దాటాలంటే యమపురికి సిద్ధం కావాల్సిందే

★ఎంతో మంది యువకులు పేద కుటుంబాలకు చేతికి అంది వచ్చిన కొడుకులు దుర్మరణం

★వాహనాల వేగాన్ని తగ్గించడానికి భారీ కేడ్లు గాని, స్పీడ్ బ్రేకర్లు గాని లేకపోవడం

★వాహనదారులు టర్నింగ్ లో స్పీడును కంట్రోల్ చేయలేక రెప్పపాటులో బారీ ప్రమాదాలు

★సుమారు 50 పైగా కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయి అనాధలుగా మారిన వైనం

నేటి గద్దర్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్, మేడ్చల్ జిల్లా బ్యూరో, (జూలై 29):

హైదరాబాద్ కి కూత వేటు దూరంలో ఉన్న మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడలో ఎంతోమంది అభాగ్యులు తమ ప్రాణాలను రోడ్డు దాటడంలో పణంగా పెడుతున్నారు.

ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు దీనిపై స్పందించి మరో అభాగ్యుడు మృత్యువాత పడకుండా కాపాడాలని అన్నోజిగూడ ఆర్జీకే కాలనీ వాసులు అధికారులకు మొర.

రోడ్డు దాటుతుండగా దాదాపు 50 పైగా కుటుంబాలు అనాధలుగా మారిన సంఘటన ఘట్కేసర్ లోని అన్నోజిగూడ ఆర్జికే కాలనీలో వెలుగు చూపుతుంది. దాదాపుగా 50 కి పైగా ఆర్జీకే వాసులు మృత్యువాత చెందిన ఇప్పటివరకు నాయకులకు చలనం లేదంటే నాయకులు ఏ తీరుగా పనిచేస్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా సాపిగా మాటలు దాటిస్తున్నారు. ఎంతోమంది కుటుంబాలు వీధిన పడ్డ ఏ నాయకుడు గానీ ఈ అధికారి కానీ వచ్చి చూసినా పాపాన పోలేదు.

కనీసం ఎన్టిపిసి రోడ్డుకు అండర్ బ్రిడ్జి తీసుకురావడానికి ఏ నాయకుడు ముందు పడలేదు. హైదరాబాద్ కి కూత వేటు దూరంలో ఉన్న ఘట్కేసర్ అన్నోజిగూడలో ఎంతోమంది అభాగ్యులు తమ ప్రాణాలను రోడ్డు దాటడంలో పణంగా పెడుతున్నారు.

ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు దీనిపై స్పందించి మరో అభాగ్యుడు మృత్యువాత పడకుండా కాపాడాలని అన్నోజిగూడ ఆర్జీకే కాలనీ వాసులు తమ మొరను వివిధ సంఘాల నాయకులకు, ప్రజా ప్రతినిధులతో చెప్పుకున్నారు.

మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ ఎన్ టి పి సి కూడలి ప్రమాదాలకు నిలయం.

ఎందుకంటే ఎందుకంటే పది కాలనీలా వాసులు, అనేక రకాల విద్యాసంస్థలు ఇంజనీరింగ్ ఇంటర్ అనేక పాఠశాలల విద్యార్థులు , వివిధ కాలనీల ప్రజలు బతుకు తెరువు కోసం రోడ్డు దాటాల్సిందే

ఇప్పటివరకు ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంది. ఎన్నో కుటుంబాలు వీధిన పడి అన్నార్తులై అగోలిస్తున్నారు. కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కులను పొట్టన పెట్టుకున్నా ఇప్పటికైనా అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం జరిగేనా..?. అని ఆర్ జి కే కాలనీ వాసులు ఎంతో ఆశతో తమ ప్రాణాలను అరిచేత పట్టుకుని ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికైనా నాయకులు, అధికారులు వెంటనే స్పందించి ఎన్టిపిసి రోడ్డు కూడలిలో అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఆర్జీకే కాలనీ వికలాంగుల కాలనీ, గణపురం గ్రామం లింగాపురం, ఫకీర్ టెంక్య, ఇతర చుట్టుపక్కల కాలనీల వాసులు ముక్తకంఠంతో అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరగాలని కోరుతున్నారు.

★ప్రమాదాలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోండి

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ నుంచి వచ్చే వాహనాలు వేగంగా వస్తుంటాయి. పది కాలనీల ప్రజలు అనునిత్యం రోడ్డు దాడతారని ఆ రోడ్డు దాటే క్రమంలో ఎంతో మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పది పదిహేను కాలనీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్, అనేక పాఠశాలల విద్యార్థులు, వికలాంగుల కాలనీలు, ఆర్జికే కాలనీ వాసులు వివిధ గ్రామాల వాసులు తమ తమ వ్యక్తిగత పనుల మీద నడుస్తూ రోడ్డు దాటుతూ ఉంటారు. వాహనాల వేగాన్ని తగ్గించడానికి భారీ కేట్లు గాని,స్పీడ్ బ్రేకర్లు గాని లేకపోవడం వల్ల వాహనదారులు టర్నింగ్ లో స్పీడును కంట్రోల్ చేయలేకపోతున్నారు. రెప్పపాటు కాలంలోనే ప్రమాదాలు జరిగి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయి. ఆ రోడ్డు మీద నడవాలంటే ప్రాణ సంకటమే అయిన తప్పని పరిస్థితి ప్రాణాలు అరచేత పట్టుకుని రోడ్డు దాటుతున్న పరిస్థితి. ఈ రోడ్డు వల్లే ఎక్కువగా ప్రమాదాలకు గురై, ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ విషయమై
ప్రజలంతా ముక్తకంఠంతో అధికారులను నాయకులను వేడుకుంటున్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మాసాయిపేట దాబాలో మత్తు పదార్థాల విక్రయం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరి పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఇన్ఫోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు.హెరాయిన్ తయారీకి

Read More »

ఇంటింటికి సమగ్ర సర్వేకు ప్రజలు సహకరించాలి పల్లె రాంచందర్ గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల మరియు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మెదక్ జిల్లా

Read More »

రామాయంపేట పట్టణంలో ఘనంగా మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవం

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) నవంబర్ 21:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల ఆవిర్భావ దినోత్సవాన్ని ముదిరాజ్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో జెండా ఎగరవేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా

Read More »

వైరా ఎమ్మెల్యే సోదరుడు మాలోత్ వాల్యా నాయక్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన వైరా మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. కొత్తగూడెం నియోజవర్గం కారుకొండ గ్రామపంచాయతీ స్వగ్రామం నందు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ రెండో సోదరుడు మాలోత్ వాల్యా నాయక్

Read More »

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ బాధ్యతాయుతంగా చేపట్టాలి.

జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 శాతం ఇంటింటా సర్వే జరిగింది. సర్వే డేటా ఎంట్రీ తీరును పరిశీలించి, ఆపరేటర్లకు దిశానిర్దేశం చేస్తున్న… జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. నేటి గాదార్, ములుగు జిల్లా ప్రతినిధి,

Read More »

రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు..

నేటి గదర్, ములుగు జిల్లా ప్రతినిధి, కౌశిక్, నవంబర్ 21: ములుగు మండలం రాంనగర్ తండా లో గుడుంబా తనికీలు నిర్వహించడం జరిగింది ఇట్టి తనికీ లలో 1)గుగులోతు స్వరూప W/o శ్రీను 2)భూక్య

Read More »

 Don't Miss this News !