◆ప్రకృతి అమ్మ వారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలు పొందండి -తుంగతుర్తి రవి
నేటి గద్దర్ ప్రతినిధి మొక్క ఉపేందర్ గౌడ్ మేడ్చల్ జిల్లా బ్యూరో, (జూలై 30):
మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పర్వతపూర్ సాయి ప్రియ కాలనీలో గల పెద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు హాజరై అమ్మవారిని దర్శించుకున్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి గారు.
వారు మాట్లాడుతూ కాలనీలోని ప్రజలు అష్టైశ్వర్యాలతో, సుఖః సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నానన్నారు.
ఈ కార్యక్రమం లో సాయి ప్రియ కాలనీ పెద్దమ్మ తల్లి & గణేష్ ఉత్సవ సొసైటీ అధ్యక్షులు ఆకుల కమలాకర్ ,జనరల్ సెక్రెటరీ మంద వెంకటరెడ్డి ,వైస్ ప్రెసిడెంట్ సరసం రవీందర్ రెడ్డి,శ్రీకాంత్ యాదవ్, మహేశ్వరప్ప, సాయి బాబా,కృష్ణ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 98