నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, మార్చ్, 14: దమ్మపేట మండలంలో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దమ్మపేట మండలంలో పర్యటించి నాచారం గ్రామంలో శ్రీ జగదాంబ సమేత జయలింగేశ్వరస్వామి జాతర మహోత్సవం, మొద్దులగూడెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఏకుల పోతమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆసన్నగూడెం గ్రామంలో బేతిని బ్రహ్మాజీ కుమారుడి వివాహం ఇటీవల జరగగా పవన్ కుమార్-నాగవతి నూతన దంపతులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ముష్టిబండ గ్రామంలో కాకర్ల గంగాధర్ (బాలు) కుమార్తె హంపి వివాహ వేడుకకు హాజరై నూతన వదువును ఆశీర్వదించారు. దమ్మపేట మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ నాయకులు రొయ్యల కుమార్ ఆనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొంది ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారిని పరామర్శించి, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
