నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మార్చ్, 14: వేసవిలో మండల ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనయంని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఐక్యత ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సిఐ కరుణాకర్, ఎస్ఐ యయాతి రాజు, స్టేషన్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండాకాలం రోడ్డున వెళ్లే ప్రజలకు పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు మంచినీరు అందించి వారి దాహార్తి తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయం అని ఎమ్మెల్యే జారె అన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, ఐక్యత ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు జుజ్జురపు రాంబాబు, క్లబ్ అధ్యక్షులు కూన చిన్నారావు, ప్రధాన కార్యదర్శి పామర్తి మధు, కోశాధికారి చిన్నంశెట్టి నాగబాబు, సహాయ కార్యదర్శి మద్ధు రవి, దాది.చంటి, సోమేశ్ సభ్యులు నవీన్, రవి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
