★గ్రామపంచాయతీ సెంటర్ నుంచి ప్రధాన సెంటర్ వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమ సందర్భంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్న మండల అధికారులు
నేటి గద్దర్ న్యూస్ ముదిగొండ మండల ప్రతినిధి మరికంటి బాబురావు
ముదిగొండలో స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం తప్పనిసరి చేపట్టాలి. గ్రామాల పరిశుభ్రతలో భాగంగా మురికి కాలువలను శుభ్రం చేయాలని, మురికి కాలువలలో పూడిక తీయాలని, పిచ్చి మొక్కలు తొలగించాలి. మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటడం, గుబురుగా పెరిగిన మొక్కలను కత్తిరించి అందంగా తీర్చిదిద్దడం, కొత్త మొక్కలను నాటే కార్యక్రమాలను చేయాలి. సీజనల్ వ్యాధులపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్, స్ప్రే చేయాలి. ముదిగొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మండల స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి .మండల కేంద్రంలో గ్రామపంచాయతీ నుంచి ప్రధాన సెంటర్ వరకు స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం సందర్భంగా నినాదాలు చేస్తూ ర్యాలీ లో పాల్గొన్న మండల అధికారులు,మహిళా సంఘాలు,గ్రామపంచాయతీ కార్మికులు